ఈ వారం కథ

సంచలన చరిత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ చరిత్రకి బంగారు భవితకి విద్య, కళలే పునాది. మనకు అవసరమైన ప్రత్యేక గ్రంథాలు అన్నీకొని చదవలేము. అవి గ్రంథాలయాలద్వారా లభ్యమవుతాయి. ఇపుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని ప్రయివేటువి, కొన్ని ప్రభుత్వం వారివి ఉంటాయి. కొన్ని సంచార గ్రంథాలయాలు ఇంటికి పుస్తకాలు, మాగ్‌జైన్స్ లాంటివి తెచ్చి ఇస్తారు. వీటికి కొంత రుసుం ఎక్కువ ఉంటుంది. అయితే పుస్తక పఠనం ద్వారా వ్యక్తుల్లో ఎంతో వికాసం వస్తుంది. ఈ తరంలో పుస్తక పఠనం తగ్గింది. అయితే ప్రభుత్వం వారు వేసవి సెలవుల్లో పిల్లలకి డ్రాయింగ్, పెయింటింగ్, నృత్యము, సంగీతము, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పుస్తక పఠన, కథ సృజన అంటే పుస్తకాలు చదివి కథలు చెప్పడం అన్నమాట. ఇలాంటి అంశాలపై బాల వికాసాన్ని అందించుటకు గ్రంథాలయాలను వేదికగా ఏర్పాటు చేశారు.
అయితే ఎన్నో చోట్ల దానికి తగిన వసతులున్నాయి? టీచర్స్‌ను ఎక్కడినుంచి తెస్తారు. వారికి సౌకర్యాలు చేయడం - ఇవన్నీ సమస్యలే. అయితే గతంలో రీడర్స్ ఫారమ్ సభ్యుల్ని గ్రంథాలయ అభివృద్ధికి ఏర్పాటుచేశారు. వారంతా బాల బాలికల పురోగతికి ముందంజ వేస్తారని ఆశిద్దాం. తణుకులో-ఏలూరులో ప్రత్యేకంగా మహిళా గ్రంథాలయాలు ఉన్నాయి. గతంలో ఈ రీడర్స్ ఫోరమ్ ద్వారానే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకి నవంబర్ 14 బాలల దినోత్సవం మొదలు, మహిళా దినోత్సవం, 20వ తారీఖు ముగింపు సభగా అంటే నెహ్రూ పుట్టినరోజు, ఇందిరాగాంధీ పుట్టినరోజు వరకు ఎన్నో గొప్ప కార్యక్రమాల్ని నిర్వహించేవారు. ఎప్పుడు నవంబరు వస్తుందా అని పిల్లలు కళలు నేర్చుకుని ఎదురు చూసేవారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఇప్పటికి నిర్వహిస్తున్నారు. ఎందరికో బహుమతులు అందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో గ్రంథాలయంలో వేసవి సెలవుల్ని కళాభివృద్ధికి వినియోగించడం అభినందనీయం. ఇపుడు ఆ సంస్థలే బాధ్యత వహించి పిల్లలకి కళలు నేర్పించడం అత్యంత అభినందనీయం. స్కూల్స్‌లో రెగ్యులర్‌గా డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వము, సంగీతము క్లాసులుండాలి. ఇపుడు అవి లేవు. కొన్ని స్కూళ్ళల్లో అసలు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషుకే ప్రాధాన్యతనిచ్చి ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారుచేస్తున్నారు.
అమృత ఒక ప్రయివేట్ టీచర్. ఇంటి దగ్గర పిల్లలకి హిందీ పాఠాలు చెప్పేది. మహిళా సమస్యలు గురించి చర్చిస్తూ ఉండేది. లైబ్రరీకి తరచూ వెళ్లి పుస్తకాలు చదివి, నెలవారి ఇష్టాగోష్టులు నిర్వహించేది. దీనివల్ల మహిళా సమస్యల్లో కొంత అవగాహన వచ్చేది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కొందరు ఎంపిక అయ్యారు. కొందరు మంచి వక్తలుగా, రైటర్స్, రాజకీయ నాయకులుగా, టీచర్స్‌గా మారారు. బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయడం అందరికీ కుదరదు. అటువంటివారు స్వంతగా స్కూలు పెట్టుకున్నారు. మానసిక వికాసానికి పుస్తకాలు ఎంతో తోడ్పడుతున్నాయి. ‘‘చలనం లేని పుస్తకం- సంచలన చరిత్ర సృష్టిస్తోంది’, ‘పుస్తక పఠనం ప్రతిభకు కారకము’, ‘పురస్కారాలకు పునాది’ అనాదిగా వస్తున్న చరిత్ర రేపటి తరానికి జ్ఞానోదయాన్ని అందిస్తుంది. ఇలాంటి సంచలన దిశలో ప్రతి వ్యక్తి ఎదగాలి. వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి. అందుకే పిల్లల్ని అమృత ప్రతి ఆదివారం గ్రంథాలయానికి తీసుకెళ్లి పుస్తకాలు చదివిస్తుంది. ఆమె కృషి ఫలితంగా పిల్లలిద్దరూ విద్యావంతులై బ్యాంక్ జాబ్స్ చేస్తున్నారు.
చిన్నప్పుడే పుస్తకాలపై ప్రేమ పెంచుకుని, పుస్తక పఠనంలో మునిగితేలే అమృత, తన ఖాళీ సమయంలో ప్రముఖుల జీవితాలు చదివేది. మంచిగా ఉపన్యాసాలు, వ్యాసాలు తయారుచేసి పిల్లలకి కోచింగ్ ఇచ్చేది. ఎక్కడ పోటీలు ఉన్నా పిల్లలు తమకు కావాల్సిన వ్యాసాలు తయారుచేసి ఇచ్చేది. దానికి కొంత రుసుము తీసుకునేది. ఉచితం అనగానే కొందరిలో సంకుచితభావం వస్తుంది. వీళ్ళకి ఏమి రాదు. అందుకే ఉచితంగా చెపుతున్నారు అంటారు. అందుకే అమృత కొంత రుసుముతో పిల్లలకి అన్నీ నేర్పిస్తుంది.
ఈమధ్య వ్యక్తిత్వ వికాస శిక్షణ అంటూ పెద్ద పెద్ద సేవా సంస్థల్లో, కర్మాగారాల్లో ప్రత్యేక ఉపన్యాసాలు ప్రముఖుల్ని ఆహ్వానించి నేర్పిస్తున్నారు. వారు 4 గంటల్లో ఎంతని చెప్పగలరు? అందుకే గ్రంథాలయానికి రెగ్యులర్‌గా వెళ్లి చదివితే వ్యక్తిత్వ వికాసం అలవడుతుంది. ఈ వేసవి సెలవులకి కళలతోపాటు వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తే రేపటి తరానికి మంచిది.

-ఎన్.వాణీప్రభాకరి