ఈ వారం కథ

సర్దుబాటుతోనే స్వర్గం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వకాలంలో ఎక్కడ చూసినా ఉమ్మడి కాపురాలుండేవి. ఇంటినిండా మనుష్యులు.. ఎప్పుడూ ఎవో ఒక పండుగలు, పబ్బాలు.. జన్మదినమో, పెళ్లిరోజో ఏదో ఒకటి ఎవరికో ఒకరికి ఉండేది దానితో ఇంట్లో ఎపుడూ పండుగ వాతావరణం ఉండేది.
అపుడప్పుడు వారి మధ్య మాటల యుద్ధాలు కూడా జరుగుతుండేవి. కాని అవి పెద్దవాళ్ల కలుపుగోలుతనంతోనో లేక వాళ్ల కోపం వల్లనో కాని ఎవరికి వారు సర్దుకునిపోతుండేవారు. ఎవరికి తోచిన పనిని వాళ్లు చేసుకొని పోతుండేవారు. దానితో అంతా ఒక్కటే అన్నభావం కనిపించేది.
నేడు ఎక్కడ చూసినా న్లూక్లియర్ ఫ్యామిలీస్... అమ్మనాన్న ఒక పిల్లవాడో ఒక్క పిల్లనో ఉంటున్నారు. నలుగురున్న కుటుంబాలు కూడా తక్కువగానే కనిపిస్తాయి.
కాని వారిలో కూడా సఖ్యత లేదు. పిల్లలకు వేరు వేరు గదులు... పెద్దవాళ్లు ఎవరిలోకంలో వాళ్లు... రోజులో కనీసం రెండుగంటలన్నా వారు కలసి మాట్లాడుకుంటారా అన్నది అనుమానమే.
ఇద్దరికీ ఉద్యోగాలు .. తప్పనిసరిగా కొన్ని కలసి చేయాల్సిన పనులు ... అంతేకాని నీకోసం నేను నా కోసం నీవు అన్న ధోరణి మారింది. నీవు ఇది చేశావు కనుక నేను అది చేస్తాను. ఇది నాకు ఇది నీకు ఇదే ధోరణి పిల్లల్లోనో నూరిపోస్తున్నారు.. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఇదంతా అంటున్నారు.. విడాకులెక్కువై పోయి సింగిల్ పారెట్ పిల్లలు వాళ్లు అమ్మతోనో ఒంటరిగా ఉంటున్నారు కాని అప్పుడన్నా అన్నదమ్ములతోనో, లేక అమ్మనాన్నలతోనో ఉండడం లేదు.. ఈ సింగిల్ పేరెంట్ ముందు అమ్మను తీసుకొంటే అమ్మ పొద్దునే్న ఆఫీసుకు వెళ్లడం...అక్కడ కష్టాలు... ఇల్లు నడిపివ్వడం.. సంతానాన్ని చదివించడం.. వారి ఆలనాపాలనా చూడడం అన్నీ ఒక్కరే చేయడంతో టైమ్‌లేక అలసిన మనసు .. అలసిన శరీరంతో పిల్లలను పట్టించుకోకపోవడం.. కొన్ని సార్లు గారాబంగా పెంచాలన్న ఉద్దేశంతో వారికి పరిమితిని మించి స్వేచ్ఛ నివ్వడం ఇట్లాంటివన్నీ కలసి పిల్లల్ను తప్పుదారిలో నడిపిస్తున్నాయి... అటు విడాకులు తీసుకొన్న మగవారిని తీసుకొంటే...వాళ్లు రెండవ పెళ్లి చేసుకోవడం.. పిల్లలను సరిగా పెంచలేకపోవడం.. కొత్తవారితో సర్దుకుని పోవడం చేతకాకపోవడం.. ఇట్లాంటివన్నీ చేరి అక్కడి పిల్లలు కూడా చెడుదారినే ఎంచుకుంటున్నారు.
ఏతావాతా పెద్దవాళ్లకు జీవితం చివరి దశలోనో.. మధ్యదశలోనో... ఉంటే ఎదిగే పిల్లలు భవిష్యత్తు అంతా వారిదే అయినా వారు సక్రమమైన దారిలో నడవక భావి జీవితాన్ని చీకటిమయం చేసుకొంటున్నారు...
ఇక రిటైర్ అయిన అమ్మనాన్నలు కొడుకు కు ఉంటే వారి తప్పనిసరిగా వృద్ధాశ్రమాల పాలు అవుతున్నారు. కోడలలో లేక అత్తనో ఒకరితో ఒకరు సర్దుకుని పోవడం రాక వీళ్లను భరించే శక్తి తమకు లేదనో వీరితో కలసి ఉండే సహనం నశించిదనో ఏదో ఒక కారణంతో వృద్ధులు వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు...
అక్కడ ఎంత ప్రేమగా చూసుకొన్నా తనవారు లేరన్న బాధతో జీవితచరమాంకంలో మానసిక వ్యధకు లోనైయ్యేవారు ఎక్కువవౌతున్నారు.
ఈ పద్ధతి పోవాలంటే మహిళలే చొరవ తీసుకోవాలి. ఇంటిని తీర్చిదిద్దే నేర్పు కేవలం ఇల్లాలికే ఉంటుందనేది నూరుపైసల నిజం. ఆడదిక్కులేని ఇల్లు అడవితో సమానం అన్న సామెత ఊరికే పుట్టలేదు. కనుక మహిళలే చేయి చేసుకొని కుటుంబం అంటే అత్తమామ, బావలు, వదినలు, అక్కలు, పిన్నులు, పెద్దమ్మలు..పిల్లలు అనే ఉమ్మడి కాపురం అనుకొని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారు దూరంగా ఉన్నా ప్రేమాప్యాయతలను పంచితే ఇల్లే స్వర్గంగా భాసిల్లుతుంది. అపుడు వృద్ధాశ్రమాలు దూరవౌతాయి. కాస్తంత సర్దుబాటు పిల్లల భవిష్యత్తు బంగారు మయం చేస్తుంది.

-మురళీధర్