ఈ వారం కథ

మితిమీరితే ...అంతా అనర్థమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి తరంలోని పెద్దలు మా కాలం లో నైతే... మేమైతే... అంటుంటారు. ఇప్పటి జనరేషన్ వాళ్లను చూసి వాళ్లు చేసేవి చూసి .. కాని ఏదైనా మితిమీరితే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఆ విషయం పైన దృష్టి పెట్టకుండాచాలామంది ఎదేదో చేసేసి చివరకు మేము ఎంత చేశాం. కాని ఇదంతా ఇదిగో వీళ్ల వల్ల ఇలా అయింది అనేస్తుంటారు.
ఎంతకీ ఏ విషయం గురించి అనుకొంటున్నారా.. అదేనండి డిసిప్లెన్ .. క్రమశిక్షణ ... పూర్వకాలంలో తెల్లవారు జామున 4 గంటలకు లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం పిల్లలైతే చదువుకోవడం పెద్దలైతే పూజా పునస్కారాల్లో మునిగి పోతుండేవారు.
కాని రానురాను కాలం మారింది. తెల్లవారు జాము 4కి బదులుగా 6కు లేవడం చదువుగిదువు లేకుండా పరుగుపరుగున స్నానం గీనం చేసేసి సద్దన్నం తినేసి పరుగు పరుగున స్కూల్స్ పరుగెత్తడం పిల్లల వంతు.. చేశామంటే చేశామని పూజాదికాలు చేసేసి ఆఫీసులకు పెద్దలు పరుగెత్తడం సాధారణంగా జరుగుతుండేది.
కాని ఈ మథ్య కాలం మరీ పరుగెత్తిపోతుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ చూసినా న్లూక్లియర్ ఫ్యామిలీస్.. దాంతో భార్యాభర్త పిల్లనో పిల్లాడో ఎవరో ఒక్కరే.. లేకపోతే ఇద్దరు అంతకు మించి పిల్లలులేరు. కాని భార్యాభర్తలిద్దరూ ఆఫీసులకు వెళ్తున్నారు. పిల్లలు స్కూల్ అదీ పొద్దున ఎనిమిదింటికి వెళ్లితే స్కూల్ తర్వాత ట్యూషన్ స్పెషల్ క్లాసులు అన్నీ ముగించుకుని వచ్చేసరికి రాత్రి ఎనిమిది అవుతోంది.
పెద్దలిద్దరూ కూడా ఆఫీసు పనులు ముగించుకుని వెళ్లి వచ్చేసరికి రాత్రి 9 దాటుతుంది. పైగా నీరసం.. ఏదో చేశామనిపించి తిన్నామనిపించి లేకుంటే హోటల్ నుంచి తెప్పించుకుని తిని హాయిగా మంచం ఎక్కేస్తున్నారు. వారి నలుగురి మధ్య మాటలు కూడా కరువేగానే ఉంటాయి. ఎప్పుడైనా సండే వస్తే నిద్ర లేవడం దగ్గర నుంచి అన్నీ లేట్ లేటుగా ఉంటుంటాయి.
అట్లాంటపుడే పిల్లలు వీడియోగేమ్స్ ఆడుతుంటారు. ఒక్కోసారి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే వీడియోగేమ్స్ ఆడుకోమని పెద్దలు సలహా ఇస్తున్నారు. కాని, దీనివల్ల వచ్చే అనర్థాలు ఎవరూ గమనించడం లేదు. మా కు తెలసిన వారిలో ఒకరు ఊరికి దూరంగా ఓ ఇల్లు కట్టుకున్నారు. అక్కడ అన్నీ సదుపాయాలు లేక వాళ్ల పిల్లవాడికి దగ్గరలో ఉంటుందని ఓ అపార్ట్‌మెంట్ తీసుకొన్నారు. ఇంట్లో పిల్లవాడిని స్కూల్ నుంచి వచ్చాక చూసుకోవచ్చు అని అమ్మమ్మ వరుస అయ్యే ఒక పెద్దావిడ ఆవిడకైతే బాగా డబ్బు ఉంది. పైగా పెన్షన్ కూడా వస్తుంది. మనకేమీ ఇబ్బంది ఉండదు. పైగా పిల్లలంటే చాలా ఇష్టం మన పిల్లవాడిని చూస్తుందనుకొంటూ ఆమెను తెచ్కిచ ఇంట్లో పెట్టుకున్నారు. భార్యభర్తలిద్దరూ ఆఫీసు కెళ్లిపోయాక ఈ పిల్లవాడికి వేసవి సెలవులు.. అపుడు వీడిని చూడడానికి ఈమెను ఇంట్లో పెట్టారు వాళ్లు. ఆ పిల్లవాడేమో బయటకు వెళ్లి అపార్ట్‌మెంట్ కింద పిల్లలంతా ఆడుకుంటున్నారు. నేను వారితో వెళ్లి ఆడుకుంటాను అంటాడు. కాని ఈ పెద్దావిడ వద్దు వద్దు అలాగా జనంతో కలసి తిరిగితే లేని చెడు అలవాట్లు వస్తాయి. అసలు ఎవరితోను ఆడుకోవద్దు. నాతో ఆడుకో అంటుంది. ఎంతసేపు వీడియోగేమ్స్ లేకపోతే టీవి ఇలా ఆ పిల్లవాడిని గదికే అంకితం చేస్తున్నారు.
మనం ఆలోచిద్దాం... ఏదైనా అతి అయితే అనర్థమే కదా. ఇంట్లో వీడియోగేమ్స్ మాత్రమే ఆడుతూ ఉంటే పిల్లలకు నలుగురితో కలవడం పోతుంది. నలుగురితో కలసి మాట్లాడడంలో నేర్పు ఉండదు. శారీరక శ్రమ లేక శరీరం మొద్దుబారినట్టు అవుతుంది. లేక ఒబెసిటీ వస్తుంది. చిన్నవారైనా పెద్దవారైనా కాస్త శారీరిక శ్రమ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది.
పిల్లలు అల్లరి చేస్తూ నలుగురితో కలసి ఉంటే వాళ్లు పెద్దయిన తరువాత కొత్తవారితో మాట్లాడడం.. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడం, శారీరిక శ్రమ కావాల్సి వచ్చినపుడు వీరువెనుకంజ వేయకుండా ఉండడం లాంటివి తెలియకుండానే అలవాటు అయిపోతాయి. ఇంట్లోనే కూర్చోబెట్టి కేవలం పుస్తకజ్ఞానానే్న ఇస్తూ పోతే వారిలో సమాజంలో తిరిగే నేర్పు కొరవడుతుంది. లౌకిక జ్ఞానం లేక వారు జ్ఞానమున్నా ఏ సమయంలో ఏమి చేయాలో నిర్ధారించుకోలేకపోతున్నారు. ఆత్మనూన్యతకు కూడా గురైయ్యే ప్రమాదం ఉంది.
అందుకే పిల్లల్ని నలుగురితో కలసి ఆడుకునేట్లు చేయాలి. నలుగురితో కలసి మెలసి ఉండేవిధంగా వారికి వాతావరణాన్ని కల్పించాలి. పెద్దలైనా కూడా ఎప్పుడూ పనే కాక ఇరుగుపొరుగులతో కాసేపు మాట్లాడడం వారి బాగుగోగుల్లో వీరు పాలు పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటే పెద్దలను అనుకరించే పిల్లలు సమాజంలో మంచి పౌరులుగా తయారు కావడానికి అవకాశాలు ఉంటాయి.

--వాణి ప్రభాకరి