ఈ వారం తార

అలా అనేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్క హీరోయిన్‌కు గతంలో నటించిన హీరోలతో మంచి స్నేహం ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు దొరుకుతాడా, వ్యతిరేక వ్యాఖ్యానాలతో దిమ్మదిరిగే కౌంటర్‌లు ఇద్దామా అని కొందరు ఎదురుచూస్తుంటారు. అలాంటివారిలో పూనమ్ కౌర్ చేరుతుంది. గతంలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు సరైన అవకాశాలు లేక బ్యాక్ టు పెవిలియన్‌లా వెళ్లిపోయింది. కానీ గతం తాలూకు కోపతాపాలను ఇపుడు ప్రదర్శిస్తోంది. తాజాగా పేరు చెప్పకుండా తన నెగెటివ్ ప్రచారం సదరు హీరోపై సాగిస్తోంది. ఇంతకూ ఆ హీరో పేరేంటో చెప్పట్లేదు. ఆయన చేసిన పనులు, ప్రచారాలు ప్రజలు అతన్ని ఏమనుకుంటున్నారో తదితర విషయాలన్నీ చెప్పేస్తోంది. విషయంలోకి వెళితే తాజాగా అనేక ట్వీట్స్ వ్యతిరేకంగా మాట్లాడిన పూనమ్ కౌర్ ఇప్పుడో బాంబ్ పేల్చింది. ఓ అబద్ధాలకోరు ప్రజలకు నాయకుడు అవుతాడేమో కానీ వాళ్లకు నచ్చిన లీడర్ మాత్రం కాలేడు అనేసింది. ఈ వార్తను బట్టి పవర్‌స్టార్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతోందని ఆయన అభిమానులు గుర్తుపట్టేశారు. మొత్తానికి ట్వీట్‌ల యుద్ధం జరుగుతోంది. పూనమ్ కౌర్‌మాత్రం ఎక్కడా జంకకుండా తన పంథాలో తాను ట్వీట్స్ బాణాలు వేస్తూనే వుంది. మొత్తానికి ఎప్పుడు ఆపుతుందో ఏమో!