ఈ వారం తార

పదేళ్ల ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల ముద్దుగుమ్మ అంజలి కెరీర్‌లో ఇప్పటి వరకు పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. తెలుగు, తమిళ భాషల్లో అటు సీనియర్, ఇటు జూనియర్‌లు అంటూ తేడాలేమీ పెట్టుకోకుండా, తను చేసే క్యారెక్టర్‌కే ప్రాధాన్యమిస్తూ అందరితో జోడీ కట్టింది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ సుందరాంగి వైవిధ్యమైన పాత్రల ద్వారా ఇటు తెలుగు, అటు తమిళంలోనూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అంజలి నటిస్తున్న తాజా చిత్రం ‘బెలూన్’. ఇది హారర్ నేపథ్యంగా సాగే కథ. ఇది వరకే ఇలాంటి హారర్ చిత్రాల్లో నటించిన అనుభవం అంజలికి ఉంది. అందుకే ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ అమ్మడిలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. గతంలో చేసిన హారర్ చిత్రం ‘గీతాంజలి’ గుర్తింది కదా? అందులో అంజలి చేసిన క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడ్డాయి. కెరీర్ ఎలా సాగుతోంది అని అంజలిని కదిలిస్తే- ‘‘పరిశ్రమకు వచ్చి అప్పుడే పదేళ్ల ప్రయాణం పూర్తయిందంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ పదేళ్ల కాలంలో కెరీర్ ఎలా సాగింది? అని ఆలోచిస్తే నాకే వింతగా అనిపిస్తుంది. మంచి చిత్రాలు.. అంతకంటే మంచి క్యారెక్టర్లు లభించాయి. వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా ఈ విషయంలో టాలీవుడ్ ప్రోత్సాహం మరచిపోలేనిది. వివిధ చిత్రాల్లో నేను పోషించిన పాత్రలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి చిత్రాలను విజయవంతం చేసి నా కెరీర్ ముందుకు సాగేలా చేశారు. ఇవన్నీ నాకు బాగా గుర్తుండిపోయే విషయాలు. నా తాజా చిత్రం ‘బెలూన్’తో మళ్లీ కెరీర్‌లో ఊపందుకుంటానన్న నమ్మకం బలంగా ఉంది. మరో పదేళ్లు కెరీర్‌ని ఇలానే కొనసాగించాలనుకుంటున్నా. తప్పకుండా ఆ దిశగా నా ప్రయాణం ఉంటుంది’’అని ఎంతో సంబరపడిపోతూ చెప్పుకొచ్చింది అంజలి!