Others

బిజీ.. బిజీగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయాపజయాలతో సంబంధం లేకుండా రాశీఖన్నా చేతిలో ఇప్పుడు చేతి నిండా చిత్రాలే ఉన్నాయి. ఈ అమ్మడు బిజీ..బిజీగా కెరీర్‌లో పరుగులు పెడుతోంది. అందానికి తోడు అభినయంలో మంచి మార్కుల్నే కొట్టేస్తున్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. వరుస అవకాశాలతో కెరీర్‌లో పరుగులు పెడుతోంది. ఎలా వుంది కెరీర్ అని రాశీఖన్నాను కదిలిస్తే - ‘‘ హాయిగా సాగిపోతోంది. హిట్టూ, ఫ్లాపులు మన కెరీర్‌ని నిర్ణయిస్తుంటాయి. అయితే ఒక్కోసారి వ్యక్తిగత ప్రతిభ, క్రమ శిక్షణ వృత్తిపై మనకున్న అంకితభావం కూడా మన కెరీర్‌ని నిర్దేశిస్తుంటాయి. నాది కష్టపడే మనస్తత్వం అందుకే ఫ్లాప్ వచ్చినా నేనేం కుంగిపోను. అలాగే విజయం వరించినా పొంగిపోను. నా కెరీర్ నాదే. నచ్చినవి చేసుకుంటూ వెళుతుంటాను. అలా వెళ్లిన దారిలో జయాపజయాలు సర్వసాధారణం. వాటినే తలుచుకుంటూ కూర్చుంటే కెరీర్ ఇక అంతే’’ అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది.