Others

ఆమె ఐతే ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సినిమాలు రూపొందించే సంజయ్‌లీలా భన్సాలీ తాజాగా ఓ రైటర్ కథను తీసుకున్నారు. సాహిర్ లూథియాన్వి, ఆయన ప్రేయసి అమృతా ప్రీతమ్ కథను సినిమాగా రూపొందించే ప్రయత్నంలో వున్నారు. ఈ సినిమా కోసం మొదట ఇర్ఫాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రాలను ఎంపిక చేసుకున్నారు. కానీ కాల్షీట్లు కుదరకపోవడంతో ఇప్పుడు అభిషేక్ బచ్చన్, పరిణీతి చోప్రాలు కెమెరాముందుకు వచ్చారు. ఈ చిత్రంతో జస్మిత్ రీన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రచయితల కథనాలలో సున్నితమైన భావోద్వేగాలు ఉంటాయని, అలాంటివి పలికించడానికి పరిణితి చోప్రా కచ్చితంగా సరిపోతుందని చెబుతున్నాడు దర్శకుడు. ప్రస్తుతం ఆమె నటించిన ‘గోల్‌మాల్ ఎగైన్’ చిత్రం విడుదలకు సిద్ధమయంది. అర్జున్‌కపూర్‌తో ఆమె చేస్తున్న ‘నమస్తే కెనెడా’ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక పరిణీతి చోప్రా సంజయ్‌లాలీ భన్సాలీ యూనిట్‌తో కలిసి సినిమాలో నటించనుంది. అయితే అభిషేక్ బచ్చన్ చిత్రం ఏదీ ఈ సంవత్సరం విడుదల కాకపోవడంతో వచ్చే సంవత్సరం రెండు చిత్రాల్లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఒకటి పరిణితి చోప్రాతో చేస్తున్న ఈ సినిమా. చూద్దాం.. వీరిద్దరి జంట వెండితెరపై ఎలాంటి మాయ చేస్తుందో?