ఈ వారం తార

బంపర్ ఆఫర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక లైలా కోసం..చిత్రంతో తెలుగు తెరపై తళుక్కున మెరిసిన అందాల భామ పూజాహెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకొని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్‌గా మారింది. రామ్‌చరణ్ రంగస్థలం చిత్రంలో ఐటెంసాంగ్ చేసిన పూజా, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. మహేష్- వంశీ పైడిపల్లి చిత్రంలోను ఈ అమ్మడినే కథానాయికగా తీసుకున్నారు. ఇక రాధాకృష్ణకుమార్- ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోను పూజాహెగ్డేనే కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017గా కూడా సెలక్ట్ అయింది. అయితే మొహెంజదారో చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు హిందీలో మరో చిత్రం చేయనుందని అంటున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మాతగా, సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, బాబీ డియోల్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం హౌస్‌ఫుల్ 4లో పూజాహెగ్డే ఓ ముఖ్యమైన పాత్ర చేయనుందట. ఇది తనకు ఎంతో పేరుతెస్తుందని చెబుతోంది. పూజాహెగ్డే తాజా చిత్రం సాక్ష్యం త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కథానాయికగా నటించింది.