ఈ వారం తార

షాకిచ్చే రెమ్యూనరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు దశాబ్దాలుగా తనదైన ఛరిష్మాతో బాలీవుడ్‌ని ఏలుతోంది హాట్ బ్యూటీ కత్రినా కైఫ్. మల్లీశ్వరి తరువాత ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ అటుపై బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడ ఏకంగా సల్మాన్‌ఖాన్ అండదండలతో కెరీర్‌ని మలుచుకుంది. ఆ క్రమంలోనే రణవీర్‌తో ఎఫైర్, బ్రేకప్.. అటుపై తిరిగి సల్మాన్ గూటికి చేరిన వ్యవహారం తెలిసిందే. అదంతా అటుంచితే ఇంత సీనియర్ అయినా కత్రిన ఇప్పటికీ మెరుపుతీగ రూపం మెయింటెయిన్ చేస్తూ ఏకంగా యాక్షన్ హీరోయిన్‌గా ఎదిగిన తీరు మహదాద్భుతం అనే చెప్పాలి. ఇటీవలి కాలంలో కత్రిన ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనో పెద్ద అస్సెట్ అవుతోంది. దూమ్ 3లో అదిరిపోయే సర్కస్ ఫీట్స్‌తో మతిచెడగొట్టింది. ఇటీవలే టైగర్ జిందాహై చిత్రంలో పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారిగా మెరుపు ఫైట్స్‌తో అదరగొట్టేసింది. స్వాగ్‌సే స్వాగత్ పాటలో మతిచెడే స్టెప్పులతో మత్తెక్కించింది. కత్రిన కెరీర్‌పరంగా ఇంకా ఇంకా హైట్స్‌కి వెళుతోంది. అయితే ఇంత సాధించింది కదా? అసలు తన పారితోషికం ఎంత? అని ప్రశ్నిస్తే.. షాకిచ్చే ఆన్సర్ వచ్చింది. కత్రినకైఫ్ ఒక్కో ప్రాజెక్టుకు 12 కోట్ల పారితోషికం అందుకుంటోంది. ప్రస్తుతం షారూక్‌ఖాన్ ‘జీరో’లో నటిస్తోంది. అలానే సల్మాన్ సరసన దబాంగ్ 3లో నటిస్తోంది. ఈ సినిమాలకు భారీ పారితోషికం ఖాతాలో వేసుకుంటోంది.