ఈ వారం తార

పెళ్లి రహస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లవుతోంది అంటే సంబరంగా చెప్పుకుంటుంది వధువు. స్నేహితురాళ్లకు ఫోన్ చేసి కాబోయే హబ్బీ ఖరీదైన వజ్ర వైఢూర్య అంగుళీయకాన్ని తొడిగాడని ముచ్చటపడి తెగ చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ సన్నివేశమే వేరు. వేలికి ఉంగరం తొడిగాడు కాబోయే మగడు అని చెప్పుకునేందుకు ఎందుకనో తటపటాయిస్తోంది ప్రియాంక చోప్రా. గత కొంతకాలంగా విదేశీ ప్రియుడు నిక్ జోనాస్‌తో చెట్టపట్టాల్ అంటూ తిరిగేస్తున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో క్రేజీ అవకాశాన్ని కూడా కాలదన్నుకుంది. సల్మాన్ ‘్భరత్’ చిత్రం నుంచి వాకౌట్ చేసింది. ఇక అక్టోబర్ లేదా నవంబర్‌లో పెళ్లి జరగనుందని ఒకటే పుకార్ షికారు చేస్తోంది. అదంతా అటుంచితే అసలు ఈ భామ నిక్ జోనాస్‌తో ముంబై విమానాశ్రయంలో దిగినపుడు మీడియా కంట పడకుండా ఎందుకని నిశ్చితార్థపు ఉంగరం దాచేసింది? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలుత ఖరీదైన వజ్రపు ఉంగరం నాలుగో వేలికి కనిపించింది. అటుపై చటుక్కున మాయమైంది. ఆ ఫొటోల్ని బయటపెట్టి బాలీవుడ్ మీడియా నానా హడావుడి చేస్తోంది.