Others

దట్స్ జాన్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరంగేట్రంతోనే అదరగొట్టి ‘తల్లిని మించిన తనయ’ అనిపించుకున్న అందగత్తె -జాన్వీ అలియాస్ జాహ్నవి. తల్లి జ్ఞాపకాలను అనుభవాలుగా చేసుకుని బాలీవుడ్‌లో కొత్త ఐకానిక్ గాళ్‌గా ఒక్క సినిమాతోనే ఇమేజ్ సంపాదించుకుంది. ఇషాన్ కత్తర్‌కు జోడీగా ‘దడక్’ చిత్రంలో పార్ద్వి పాత్రకు ప్రాణం పోసిన జాన్వీ -యూత్ కలల రాణిగా మారిందనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయకున్నా శ్రీదేవి కూతురు కనుక -‘ఆమె మన పిల్లే’నన్న భావనను సంపాదించుకుంది జాహ్నవి. తెలుగు అభిమానుల ఆశలు నెరవేరుస్తూ అందాల చిలక టాలీవుడ్‌కు ఎగిరొస్తుందంటూ కథనాలు వెలువడినా -‘అవన్నీ నమ్మొద్దు. ప్రస్తుతం నా ఫోకస్ బాలీవుడ్‌పైనే’నని తెగేసి చెప్పేస్తోంది ఈ బ్యూటీ. కరణ్ జోహార్ తదుపరి చిత్రం ‘తక్త్’లో హేమాహేమీలు కరీనాకఫూర్, రణవీర్ సింగ్, అలియా భట్, అనిల్ కఫూర్, భూమి ఫడ్నేకర్, విక్కీ కౌశల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న జాన్వీ -సెకెండ్ సక్సెస్ కోసం వర్కవుట్స్ చేస్తోందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరు ఎవరి ఫేవరెట్? అని ప్రశ్నించినపుడు ‘ఇష్టాలు మూడ్‌ని బట్టి మారతాయి. ఎప్పుడూ ఒక్కలా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ది బోర్న్ ఐడెంటిటీ స్టార్ మట్ డామన్ నచ్చుతాడు. ఒక్కోసారి గురుదత్ సినిమాలు నచ్చుతాయి. ఈ మార్పు మాత్రం మూడ్‌ని బట్టే ఉంటుంది’ అంటూ ఆన్సరిచ్చింది. ఇటీవల డిజైనర్ మనీష్ మల్హోత్రాతో ఓ మ్యాగజైన్ కవర్ పేజీని షేర్ చేసుకున్న జాన్వీ, సిల్వర్ స్క్రీన్‌పై తల్లిలా ప్రభావవంతమైన పాత్రలు పోషించగలదన్న నమ్మకాలు వ్యక్తం చేస్తున్నారు విమర్శకులు. ఆల్ ది బెస్ట్.