Others

మెరుపుతీగకు టైం బ్యాడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహ్రీన్. మెరిపించే అందం.. మురిపించే సొగసు. ఇట్టే ఆకట్టుకోగల వర్చస్సు. వెరసి -తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో గుడి కటేసింది. ఎన్నివున్నా అదృష్టం కూడా పిసరంత ఉంటేనే పరిశ్రమలో రాణించగలిగేది? అన్న నానుడికి అచ్చమైన ఉదాహరణలా తయారైంది మెహ్రీన్ కెరీర్. నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ కథ’తో తెలుగు తెరపై తళుక్కుమంది, తెలుగుదనాన్ని ప్రతిబింబించే పంజాబీ బ్యూటీ మెహ్రీన్ కౌర్. నాని మార్క్ పెర్ఫార్మెన్స్‌తో చిత్రానికి మంచి టాక్ రావడంతో, నానితో జతకట్టిన మెహ్రీన్‌కూ త్వరగానే అవకాశాలు అందేశాయ. ఇక ఆమెకు తిరుగులేదు, స్టార్ హీరోయన్ అయపోవడం ఖాయం అనుకున్నారంతా. మెహ్రీన్ గత ఏడాది ‘నెంజిల్ తునివిరుందాల్’ చిత్రంతో కోలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రానికి సుశీంద్రన్ దర్శకుడు. అయితే ఆ సినిమాలో మెహ్రీన్ సన్నివేశాలు చాలావరకు ఎడిటింగ్‌లో ఎగిరిపోయాయి. అందుకు దర్శకుడు క్షమాపణ కూడా చెప్పాడు. అలా ఆ చిత్రం కలసి రాలేదు. తాజాగా విజయ్ దేవరకొండ చిత్రం ‘నోటా’లో మెహ్రీన్ మెరిసింది. దీంతోనైనా బిజీ అవ్వాలనుకున్న మెరుపుతీగ కల నెరవేరలేదు. నోటాలో ఆమెది విలేఖరి పాత్ర. అసలే నిడివి తక్కువ, ఆపై గుర్తింపులేని పాత్ర కావడంతో ఈ చిత్రంతోనూ మెహ్రీన్‌కు నిరాశే ఎదురైంది. మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లి అవకాశాల కోసం ఎదురు చూస్తుందో, టాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకుంటుందో చూడాలి. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో మల్టీస్టారర్‌గా రానున్న ‘ఎఫ్-2’, అలాగే సుధీర్‌బాబుతో మరో చిత్రం చేస్తుంది మెహ్రీన్. ఈ రెండు చిత్రాలే ఆమె కెరీర్‌ను ఆదుకోవాలి.