Others

నందిత జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడికి పోతావు చిన్నవాడా? చిత్రంలో నిఖిల్ సరసన ఆత్మ ఆవహించిన ప్రేమికురాలి పాత్రతో అదరగొట్టేసింది నందిత. ఆమె అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. సినిమా ఆద్యంతం నందిత షోతో కట్టిపడేసిందన్న ప్రశంసలూ దక్కించుకుంది. మంచి నటి అన్న ప్రశంసలు అందుకున్న నందిత, మొనే్న వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్రంలోనూ తనదైన నటనతో మెప్పించి ప్రశంసలు నిలబెట్టుకుంది. నటిగా అవార్డులెన్నో అందుకుని దూసుకుపోతున్న స్పెషల్ టాలెంటు నందిత శే్వత కన్నడ నుంచి తమిళంలోకి వచ్చి, అక్కడినుంచి తెలుగు పరిశ్రమలోనూ ఓ కర్చ్ఫీ వేసింది. అందుకే బ్లాక్‌బస్టర్ మూవీ ప్రేమకథా చిత్రమ్ సీక్వెల్‌కు ఎంపికవ్వడంతో, ఆ పాత్ర కోసం సిద్ధమవుతోందని అంటున్నారు. అలానే తమిళంలోనూ కెరీర్‌పరంగా పూర్తి బిజీగావుంది. ప్రభుదేవ- తమన్నా ప్రధాన పాత్రధారులుగా ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న దేవి-2 చిత్రంలోనూ నందిత కథానాయికగా నటిస్తోంది. ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్ క్రేజీ కాంబినేషన్‌లోని హారర్ మూవీ నేంజమ్ మరప్పతిలై చిత్రంలోనూ నందితే కథానాయిక. శివాజీ గణేశన్, సావిత్రి జంటగా నటించిన క్లాసిక్ మూవీ వనంగమూడి చిత్రం రీమేక్‌లోనూ నందిత లీడ్ రోల్ చేస్తోందట. తాజాగా స్పైడర్ ఉమెన్ లుక్‌లో ఫొటో షూట్ ఒకటి అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. నందిత స్వయంగా సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫొటోల్ని అభిమానులకు షేర్ చేస్తోంది. ఎంతైనా నందిత కదా..