Others

షకీలా కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘షకీలా’ సినిమా వస్తుందంటే చాలు. పెద్ద పెద్ద స్టార్లు కూడా తమ చిత్రాలను ఆమెకు పోటీగా విడుదల చేసేవారు కాదు. అలాంటి షకీలా జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా సినీ రంగంలోకి ఎలా వచ్చారు? శృంగార తారగా ఎలా మారారు? సినీ రంగంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె కథలో చూపించనున్నారు. షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. త్వరలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టబోతోంది. అయితే ప్రమోషన్స్‌లో రిచా బెల్లి డాన్స్ చేయబోతుందట. దీని కోసం ఆమె ప్రత్యేకంగా బాలీవుడ్ బెల్లి డాన్స్‌ల స్పెషలిస్ట్‌ల దగ్గర శిక్షణ తీసుకుంటోందట. రిచా చద్దా ఈ సినిమాలో నటించబోయే ముందు షకీలాతో మాట్లాడి ఆమె వ్యక్తిగత జీవితం గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి అడిగి తెలుసుకుని మరీ ప్రాక్టీస్ చేసింది. మొత్తానికి రిచా చద్దా షకీలా బయోపిక్ కోసం బాగానే కష్టపడుతుంది. చిత్రం హిందీ, మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది.