Others

బయోపిక్‌లో జాక్వెలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్‌లకు బాలీవుడ్‌లో క్రేజ్ నడుస్తోంది. బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ లైఫ్ ఆధారంగా రూపొందిన బయోపిక్ విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సాధించింది. ఇందులో మేరీకోమ్‌గా ప్రియాంక చోప్రా నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రస్తుతం బ్యాట్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇందులో సైనాగా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ప్రియాంక, శ్రద్ధాల మాదిరిగానే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సైతం ఓ ప్రముఖ మహిళా క్రీడాకారిణి బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇండియన్ సైక్లిస్ట్ దెబోరా హెరాల్డ్ జీవితం ఆధారంగా బయోపిక్‌ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2014లో ఆసియా కప్‌లో రెండు గోల్డ్ మెడల్స్, 2015 తైవాన్ కప్‌లో ఐదు గోల్డ్ మెడల్స్, ఇండియా కప్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించడంతోపాటు ఇంటర్నేషనల్ యూనియన్ సైక్లిస్ట్ సంస్థ ప్రకటించిన ర్యాంక్‌లో వరల్డ్‌వైడ్‌గా 4వ స్థానంలో దెబోరా నిలిచారు. ఇందులో స్థానం పొందిన తొలి ఇండియన్ సైక్లిస్ట్‌గానూ ఆమె రికార్డు సృష్టించారు. 2020లో జరగబోయే ఒలింపిక్‌లో పాల్గొనబోతున్నారు. ఇదిలాఉంటే 2004లో సంభవించిన సునామీ టైమ్‌లో వారంపాటు చెట్టుమీదే దెబోరా ఇరుక్కుపోయారు. వారం రోజుల సాహసవంతమైన పోరాటం తర్వాత దెబోరా ప్రాణాలతో బయటపడ్డారు. స్ఫూర్తిదాయకమైన దెబోరా బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపిన జాక్వెలిన్ ప్రస్తుతం ‘డ్రైవ్’చిత్రంలో నటిస్తోంది.