ఈ వారం తార

చెన్నై బ్యూటీ రెజీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన పాత్రతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా -అక్కడే బిజీ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోందట. ‘ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో చిత్రమైన పాత్ర చేసి మెప్పించిన రెజీనా, ఇకపై బాలీవుడ్‌లోనే పెద్ద ప్రాజెక్టులు అందుకునే ఉద్దేశంలో ఉందంటున్నారు ఆమె సన్నిహితులు. తెలుగు ఇండస్ట్రీలో రెజీనాకు ఓ క్రేజ్ ఉంది. వర్థమాన హీరోలతో చకచకా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న చెన్నై బ్యూటీ, తరువాత తమిళ ప్రాజెక్టులపైనే దృష్టిపెట్టింది. ప్రస్తుతం తమిళంలో పార్టీ, కల్ల పార్ట్, సెవెన్ చిత్రాలు చేస్తున్న రెజీనా -తెలుగులోనూ ఒకట్రెండ్ ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్‌లో తొలి సినిమా హిట్టుకాకపోయినా, ఆమె చేసిన పాత్రతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అక్కడే మరిన్ని ప్రాజెక్టులు చేయాలన్న సంకల్పంతో ఉందట. తాజాగా ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిన రెజీనా, మరో రెండు ప్రాజెక్టులనూ లైన్‌లో పెడుతున్నట్టు సో, కాలం కలిసొస్తే రెజీనా బాలీవుడ్‌లో తిష్టవేయడం ఖాయమంటున్నారు ఆమె సన్నిహితులు.