బిజినెస్

వికటించిన ‘ఈము’ ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానరాని ప్రాసెసింగ్ కేంద్రాలు, మార్కెటింగ్ సౌకర్యాలు
పక్షులు కొనే నాథుడే లేక ఆంధ్రా, తెలంగాణ రైతులు విలవిల
నష్టాలకు జడిసి సముద్ర తీరాల్లో విడిచిపెడుతున్న దుస్థితి
రూ. 150 కోట్ల రుణాల వసూళ్లకు వెంటపడుతున్న బ్యాంకులు
ఆదుకోకపోతే ఆత్మహత్యలేనంటున్న పెంపకందారులు

భీమవరం, మార్చి 14: ‘ఈకల నుండి ఎముకల దాకా ప్రతీదీ విలువైనదే... మాంసం, చర్మం ఇలా ప్రతీదీ వేల రూపాయల ధర పలుకుతుంది...’ 2005లో తెరపైకి వచ్చిన ఈము పక్షుల పెంపకం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జరిపిన ప్రచారమిది. అంతేకాదు పెంపకంపై శిక్షణనిచ్చి, వడ్డీలేని రుణ సదుపాయం సైతం కల్పించింది. దీంతో అప్పుడు కొ న్ని సంవత్సరాల్లోనే కుబేరులమైపోతామని భావించిన పెంపకందార్లంతా ఇప్పుడు బావురుమంటున్నారు. పెం చిన పక్షులను కొనే నాథుడు లేక, ఉన్న పక్షులకు ఆహారం అందించలేక, సము ద్ర తీరాల్లో వదిలేస్తున్నారు. కాదుకాదు.. వదిలించుకుంటున్నారు. అయతే పక్షులను వదిలించుకున్నా, బ్యాంకుల రుణాలు మాత్రం నీడలా వెంటాడుతున్నాయ. ఫలితంగా రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు పెంపకందారులు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈము పక్షుల పెంపకందార్ల దీనగాథ ఇది. వివరాల్లోకి వెళితే... 2005లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాబార్డు ఈము పక్షులు పెంపకాన్ని ప్రోత్సహించింది. చిన్న, సన్నకారు రైతులకు పెంపకంలో శిక్షణనిచ్చి, తొమ్మిదేళ్లు వడ్డీలేని రుణ సదుపాయం సైతం కల్పించింది. ఒక్కో పక్షి నుంచి పది కిలోల వరకు మాంసం వస్తుందని, కిలో మాంసం రూ. 700 వరకు పలుకుతుందని, అలాగే చర్మం నుండి ఎనిమిది లీటర్ల నూనె వస్తుందని, ఇది కూడా లీటరు రూ. 4,000 వరకు ధర ఉంటుందని, ఇవి గాక ఈకలు, ఎముకలు ఇలా పక్షిలోని ప్రతీ భాగం విలువైనదేనని ప్రచారం జరిపింది. పక్షులను పెంచితే చాలు, ప్రాసెసింగ్ కేంద్రా లు ఏర్పాటుచేసి, మార్కెటింగ్ సౌక ర్యం కూడా కల్పిస్తామనడంతో రైతులంతా ఉత్సాహం గా ఈము పక్షుల పెంపకం చేపట్టారు. ఒక్కో రైతుకు రూ. 30 లక్షల వరకు రుణ సదుపాయం బ్యాంక్ కల్పించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు సుమారు రూ. 150 కోట్ల వరకు రుణాలిచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పెంపకం ఎక్కువగా చేపట్టారు. అలాగే తెలంగాణలో ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ వంటి జిల్లాలో రైతులు అధికంగా పెంచారు. తొలుత అంతా సవ్యంగానే సాగింది. ఈము పక్షులు సైతం భారీ సైజులో పెరిగాయి. అయితే పెరిగిన పక్షులను అమ్ముదామని రైతులు ప్రయత్నించినపుడు వారికి చుక్కెదురయ్యింది. మార్కెటింగ్ కోసం ఏర్పాటుచేస్తామన్న ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎక్కడా కనిపించలేదు. భారీ ఆకారంలో ఉండే వీటి పెంపకానికి రోజూ భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. చివరకు వాటిని పెంచలేక చాలామంది అర్ధరాత్రి సమయంలో సముద్ర తీరాల్లో వదిలేసి భారం దించుకుంటున్నారు. అయితే రుణాలు తీసుకుని తొమ్మిదేళ్లు పూర్తవ్వడంతో గత కొంత కాలంగా బ్యాంకులు వసూళ్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రైతులు హామీగా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామంటూ పత్రికల్లో ఫొటోలతో ప్రకటనలు జారీచేయడం ప్రారంభించాయి. దీంతో కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మరికొందరు రైతులు ఒక సంఘంగా ఏర్పడి, రుణాలు మాఫీ చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకొంటున్నారు. ఈము పక్షుల పెంపకం ఫలితాన్నివ్వనందున రుణాలు మాఫీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక శాఖ కొద్ది రోజుల క్రితం సిఫార్సు కూడా చేసింది. కేంద్రం తక్షణం రుణమాఫీ చేసి, తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలు తథ్యమని, ఇప్పటికే ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రెండు తెలుగు రాష్ట్రాల ఈము పక్షుల పెంపకందారుల బాధితుల సంఘం అధ్యక్షుడు కంతేటి వెంకట్రాజు చెప్పారు. ఈము పక్షులను పెంచడానికి ఎంతో కష్టపడ్డామని, తీరా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డునపడ్డామన్నారు.

ప్రధాని మోదీని కలిసిన రైతులు .. రుణమాఫీకి వినతి
ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈము పక్షి రైతులు సోమవారం రాత్రి న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఈము పక్షుల పెంపకం దారుల, బాధితుల సంఘం అధ్యక్షుడు కంతేటి వెంకట్రాజు, చిలుకూరి నరసింహరాజు ప్రధానిని కలిసి రుణమాఫీ చేసి ఆదుకోవాలని వినతి పత్రం అందించారు. నాబార్డు రూపొందించిన పథకంలో బ్యాంకు రుణాలు పొంది, ఈము పక్షులను పెంచిన రైతులు మార్కెటింగ్ సౌకర్యం లేక ఎలా నష్టపోయిందీ వారు మోదీకి వివరించారు. రెండు రాష్ట్రాల్లో సుమారు రూ. 150 కోట్లు మేర బ్యాంకు రుణాలు రైతులు చెల్లించాల్సి ఉందని, అయితే పూర్తిగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందివ్వలేదని పేర్కొన్నారు. గతంలో నాబార్డు ద్వారా రుణాలు పొందిన పరిశ్రమలు పూర్తిస్థాయిలో నడవకపోవడంతో రుణాలను రద్దు చేశారని, అలాగే ఈము పక్షులను పెంచి, మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టపోయిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఇటీవల మాగంటి బాబు ఆధ్వర్యంలో రుణాలను మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కూడా 18 మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో ప్రత్యేకంగా కలిశామని కంతేటి వెంకట్రాజు చెప్పారు. డ్వాక్రా, వ్యవసాయ రుణాల మాదిరిగా ఈముపక్షి రైతుల రుణాలను కూడా మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునూ కలిసి వినతిపత్రం అందించినట్టు కంతేటి తెలిపారు.