తూర్పుగోదావరి

కుయ్యేరులో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజులూరు, సెప్టెంబర్ 9: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శుక్రవారం కాకినాడలో నిర్వహించిన సభకు హాజరై చెట్టు కొమ్మ విరిగిపడి నందికోళ్ల వెంకటరమణ (20) మృతిచెందడంతో అతడి స్వగ్రామం కుయ్యేరులో విషాదం నెలకొంది. పెయింటర్‌గా వృత్తి సాగిస్తున్న వెంకటరమణ తన అభిమాన హీరో పవన్‌కళ్యాణ్‌ను చూడాలని సభకు హాజరయ్యాడు. అయితే సభ జరుగుతున్న జెఎన్‌టియుకె గ్రౌండ్ సమీపంలోని చెట్టు ఎక్కి, కొమ్మ విరిగిపడిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సమాచారం శుక్రవారం రాత్రికి కుయ్యేరులోని అతని కుటుంబ సభ్యులకు అందడంతో రోదనలు మిన్నంటాయి. వెంకటరమణ తండ్రి అబ్బులు మూడు నెలల క్రితం కన్నుమూశారు. తల్లి, మానసిక వికలాంగురాలైన సోదరి, మరో సోదరుడు ఉన్న కుటుంబానికి వెంకటరమణే పెద్ద దిక్కు. అభిమాన నటుడుని చూసి తిరిగివస్తాడని అనుకుంటుంటే మృత్యువార్త వినాల్సివచ్చిందని, ఇక తమకు దిక్కెవరని వెంకటరమణ తల్లి విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.
కాగా ఇదే ప్రమాదంలో మరో ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడి కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని రాయవరానికి చెందిన నక్కా రవి, లింగంపర్తికి చెందిన చల్లా వీరబాబు, దేవరాపల్లికి చెందిన పుప్పాల ప్రసాద్, గోరంట్లకు చెందిన కర్రి రాజారావు, వెల్లచామరంకు చెందిన కె సుబ్రమణ్యం, ఉప్పలంకకు చెందిన కంతాడి వీరబాబు, వై రామవరంకు చెందిన ఆర్ పాపరాజు కాకినాడ జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.