తూర్పుగోదావరి

100 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 27: వాహనంలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని చింతూరు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా గంజాయి తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసకుమార్ తెలిపిన వివరాలిలావున్నాయి. బొలేరో వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో సిఐ దుర్గాప్రసాద్, ఎస్ శ్రీనివాస కుమార్ చింతూరు రత్నాపురం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో సిజి7ఎఫ్ 1647 నంబరు గల బొలేరో వాహనాన్ని తనిఖీ చేస్తూ రెండు బస్తాలలో తరలిస్తున్న 100 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నాలుగు సెల్‌ఫోన్లు, రూ.2 లక్షల 40 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో చింతూరు అటవీ క్షేత్రాధికారి రాఘవరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.