తూర్పుగోదావరి

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని మంగళవారం రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నగరపాలక సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు స్థానిక త్యాగరాజ గానసభ నుంచి సరస్వతీఘాట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సరస్వతీఘాట్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, మిమిక్రీ ప్రదర్శన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కమిషనర్ వి విజయరామరాజు, సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అయితే ఆకస్మిక వర్షంతో సాంస్కృతిక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పర్యాటక సమాచార, రిజర్వేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటకుల సౌకర్యార్థం జిల్లాలో 10 పర్యాటక సమాచార, రిజర్వేషన్ కేంద్రాలను ఏర్పాటు
చేయనున్నట్లు వెల్లడించారు. సరస్వతీఘాట్, గౌతమీఘాట్ ప్రాంతంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఆలయాలు, విగ్రహాలు ఏర్పాటు చేయాలని, పార్కులు అభివృద్ధి చేయాలని గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. ఈకార్యక్రమంలో అఖండ గోదావరి ప్రాజెక్టు ఆర్‌డి భీమశంకరరావు, అదనపు కమిషనర్ జి శ్రీనివాసరావు, డిప్యుటీ కమిషనర్ ఎంవిడి ఫణిరామ్ తదితరులు పాల్గొన్నారు.