తూర్పుగోదావరి

మార్కెటింగ్ శాఖలో కాగితరహిత పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: పారదర్శకత, పనిభారాన్ని తగ్గించేందుకు మార్కెటింగ్‌శాఖలో కాగితరహిత పాలనను వచ్చేనెల నుంచి ప్రారంభించనున్నట్లు ఎడి కెఆర్ కిషోర్‌బాబు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం మార్కెట్‌యార్డులో జిల్లాలోని 20 మంది మార్కెట్‌యార్డు కార్యదర్శులకు ఇ ఆఫీసుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మండపేట, పెద్దాపురంలో కొత్తగా 2 రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్థానిక మోరంపూడిలోని రైతుబజార్ నిర్మాణం ప్రగతిలో ఉందన్నారు. కాగా, రైతుబజార్లు లేని ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం వారానికి రెండురోజుల పాటు నేరుగా ఫాంటు హౌస్ పేరిట జిల్లాలో 9 చోట్ల కూరగాయల విక్రయాన్ని ప్రారంభించాలని, మరో 9 మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.