తూర్పుగోదావరి

రైతు బజార్లకు స్థలాల కొరత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: రైతు బజార్లకు అర్బన్ ప్రాంతంలో స్థలాల కొరత సమస్యగా తయారయ్యింది. రాష్ట్రంలోని ముఖ్యమైన అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 50 రైతు బజార్లను ఏర్పాటుచేయాలని అధికారులు గుర్తించారు. ఇందుకు అవసరమైన స్ధలాలు మాత్రం అందుబాటులో లేకపోవడం వల్ల రైతు బజార్ల విస్తరణకు మార్గం లేకుండా పోయింది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ అధికార్లు రైతు బజార్లకు అనువైన స్థలాలు కేటాయించాలని కోరుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎగుమతులు, దిగుమతులకు అవనువైన, పార్కింగ్ స్ధలంవున్న ప్రాంతాలు కన్పించకపోవడంతో స్థలాల కేటాయింపు జరగడంలేదని తెలుస్తోంది. రైతులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించిన నేపథ్యంలో మరింత మందికి అవకాశం లభించేందుకు రైతు బజార్ల అవసరం వున్నప్పటికీ అధికారులు స్ధలాలు కేటాయించడంలో జాప్యం చేస్తుండటంతో ప్రతిపాదన ముందుకెళ్ళడంలేదు.
ఇదిలావుండగా మార్కెటింగ్ శాఖ గిరిజన కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని గిరిజన ప్రాంతాల్లో వారపు సంతల్లో ఉల్లిపాయలు విక్రయించేలా చర్యలు చేపట్టింది. దీనికితోడు ఫారం టు హోమ్ విధానంలో ప్రతీ రైతు బజార్‌కు అనుసంధానంగా రైతులు నేరుగా మొబైల్ రైతు బజార్లను నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈ విధానం కూడా మంచి ఫలితాలు ఇచ్చిందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో చాలా చోట్ల రైతులకు ఫారం టు హోమ్ విధానంలోనే విక్రయాలు సాగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇటు రైతు బజార్లు, అటు ఫారం టు హోమ్ విధానంలోనూ కోటి టన్నుల వరకు కూరగాయల విక్రయం జరుగుతున్నట్టు అంచనా వేశారు. ప్రస్తుతం వున్న రైతు బజార్లలో అవసరమైన వౌలిక సదుపాయాలు పెంచితే మరింత మంది రైతులకు అవకాశం లభిస్తుందని, విక్రయాలు మరింతగా విస్తరిస్తాయని అంచనాకు వచ్చారు. రైతు బజార్లలో ప్రస్తుతం రైతుల నుంచి అద్దెలు వసూలు చేయడంలేదు. కేవలం కిరాణా వంటి సరుకులు విక్రయించే స్టాళ్ళ నుంచి మాత్రమే అద్దె వసూలుచేస్తున్నారు. రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో మార్గదర్శకమైన రీతిలో రైతు బజార్ల నిర్వహణ జరుగుతున్నట్టు అధికారులు అంచనావేశారు. ఈ జిల్లాలో 13 రైతు బజార్లు వుండగా మరో 13 వరకు రైతు బజార్లు ఏర్పాటుచేయాలని గుర్తించారు. వీటికి అవసరమైన స్థలాలు మాత్రం అందుబాటులోలేవు. రైతు బజార్లకు డిమాండ్ అత్యధికంగా వుంది.