తూర్పుగోదావరి

పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, అక్టోబర్ 9: జిల్లాను పర్యాటకపరంగా అభివృద్ధి చేయడానికి 300 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం రాజప్ప, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులతో కలిసి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అనువుగా వుండే అల్లవరం మండలం బోడసకుర్రు, గోడితిప్ప ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడితిప్పలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి 70 కోట్ల రూపాయలు మంజూరుచేయడంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కాకినాడ నుండి అంతర్వేది వరకూ ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేయనుందని చెప్పారు. ఏజన్సీ ప్రాంతంలో ఎకో టూరిజం, కాకినాడలోని హోప్ ఐలాండ్‌లో 90 ఎకరాల విస్తీర్ణంలో గల బీచ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కాకినాడ నుండి అంతర్వేది వరకూ ఉన్న బీచ్‌లన్నిటినీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. కోనసీమలోని బోడసకుర్రు, చిర్ర యానాం ప్రాంతాల్లో రిసార్ట్స్ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రాజప్ప అన్నారు. కోనసీమ ప్రాంతంలో ఉన్న దీవులు పర్యాటకపరంగా అభివృద్ధి చేయడానికి అనుగుణంగా ఉన్నాయన్నారు. మడ అడవులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని, ప్రభుత్వం టెంపుల్ టూరిజానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్ధం షెల్టర్లు, దేవాలయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టి పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల ద్వారా పర్యాటకపరంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఇందులో ఏజన్సీ ప్రాంతంలో ఎకో టూరిజం, కాకినాడ హోప్ ఐలాండ్, కోనసీమ ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. కేరళ కంటే బ్యాక్ వాటర్ ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాను పర్యాటకపరంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటోందన్నారు. కోనసీమలో రిసార్టులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే రీతిలో ప్రైవేటు రిసార్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాంలో కూడా పర్యాటకపరంగా అభివృద్ధి చేయడానికి ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకరం, పర్యాటక శాఖ కనె్సల్టెంట్ సిరియాక్, అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్, అమలాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, అల్లవరం ఎంపిపి గుబ్బల మాతాకస్తూరి, ఎఎంసి ఛైర్మన్ గునిశెట్టి చినబాబు తదితరులు పాల్గొన్నారు.