తూర్పుగోదావరి

ప్రమాదం అంచున పర్యాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 4: ప్రస్తుతం గోదావరి నదిలో పర్యాటక బోట్లు నిబంధనలు పాటించడంలేదు. ప్రసుతతం పర్యాటకుల రద్దీ బాగా పెరిగింది. కార్తీకమాసం కావడంతో రానున్న రోజుల్లో మరింతగా పరగనుంది. దీన్ని సాధ్యమైనంత క్యాష్ చేసుకోవడానికి ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా పర్యాటక బోట్లు సాగిపోతున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా బోట్లను నడుపుతున్నా పట్టించుకున్న నాథుడు కన్పించడం లేదు. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే తప్ప కళ్లు తెరిచే పరిస్థితి కన్పించడం లేదు. వాకీ టాకీలు ఉండాలని, స్టాండ్‌బై మోటార్లు ఉండాలని, నిబంధనలకు మించి పర్యాటకులను ఎక్కించరాదని, రక్షణ, భద్రత చర్యలు చేపట్టాలని తదితర ఎన్నో నిబంధనలు అధికారులు రూపొందించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన టూరిజం బోర్డు సమావేశంలో బోర్డు ఛైర్మన్, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఎన్నో నిబంధనల గురించి చెప్పారు. ఇవేవీ పాటించిన దాఖలాలు కన్పించడం లేదు. సమావేశం నిర్వహించిన రెండు మూడు రోజుల పాటే పద్ధతిగా బోట్లను నిర్వహించినట్టు కన్పించింది. ఆపై పరిస్థితి యథాతథంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయ. నదిలో నీటి లభ్యత క్షీణించడంతో బోట్లకు ఇసుక దిబ్బలు తగిలేస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్టుగా తయారైంది. అనుభవజ్ఞులైన సరంగులతో బోట్లను నడిపించే విధంగా ప్రధానంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పురుషోత్తపట్నం నుంచి పోలవరం వరకు మధ్యలో తిరిగే బోట్లలో ఎటువంటి ప్రమాణాలు ఉండటం లేదని తెలిసింది. ఈ ప్రాంతంలో పర్యవేక్షించే అధికారులు కన్పించడం లేదని, దీంతో వివిధ వాహనాలను లోడు చేసుకుని ప్రయాణికులతో వచ్చే బోట్ల వద్ద పహారా కాయాల్సి ఉందని అంటున్నారు. విశేషంగా పర్యాటకులను ఆకర్షించే క్రమంలో అందుకు అవసరమైన ప్రమాణాల ప్రకారం సదుపాయాలు కల్పించాల్సి వుందని, జెట్టీలు కూడా బల్లకట్టుపైనే పర్యాటకులు ఎక్కి దిగుతున్న క్రమంలో ప్రమాదాలకు తావిచ్చినట్టుగా ఉందని భయపడుతున్నారు. ప్రధానంగా స్టాండ్‌బై మోటార్లు ఉండే విధంగాను,, కాస్తంత మెకానిజం తెలిసి ఉండే సిబ్బందితో నడిపించే విధంగానూ, ఏదో జరిగితే బాహ్య ప్రపంచానికి సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. పర్యవేక్షణ, పహారా, భద్రత, రక్షణ ప్రమాణాలను పాటించి పాపికొండలు, పట్టిసీమ, పురుషోత్తపట్నం, భద్రాచలం పర్యాటకంతోపాటు, నదిలో బోటింగ్‌కు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అన్నివిధాలా ముందస్తుగానే అప్రమత్తంగా ఉండాలని పర్యాటకులు కోరుతున్నారు. నదిలో నీటి లభ్యతను బట్టి ఎప్పటికపుడు పర్యాటక బోట్లకు అనుమతించే విధంగా పర్యవేక్షించే యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.