తూర్పుగోదావరి

మున్సిపాలిటీల్లో వౌలికసౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 7: మున్సిపాలిటీల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రానున్న కాలంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హామీ ఇచ్చారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 60.70 లక్షలతో 1, 5, 17, 26 వార్డుల్లో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రెయిన్ పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఛైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా మాట్లాడారు. అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ దశలవారీగా పట్టణంలోడ్రైనేజి వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు మెట్ల రమణబాబు, తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోసు, అల్లాడి సోంబాబు, వలవల శివరావు, యాళ్ల నాగసతీష్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.