తూర్పుగోదావరి

ఆదరణ కోల్పోతున్న నాటకరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఏప్రిల్ 8: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగమైన నాటకరంగం ఆదరణ కోల్పోతోందని, అయితే నాటక రంగానికి సిఆర్‌సి వంటి కళాపరిషత్‌లు చేయూతనందిస్తూ జీవం పోస్తున్నాయని ప్రముఖ సినీ నటుడు, రచయత ఎల్‌బి శ్రీరాం అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెం సిఆర్‌సి కళాపరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 18వ రాష్టస్థ్రాయి ఆహ్వాన హస్య నాటిక పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సిఆర్‌సిలోని కళావేదిక ఎసి ఆడిటోరియంలో ఈ పోటీలను ఎల్‌బి శ్రీరాం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎల్‌బి శ్రీరాం మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను, లోపాలను ఇతివృత్తాలుగా చేసుకుని ప్రదర్శించే నాటికల ద్వారా సమాజం జాగృతమవుతుందన్నారు. వేగవంతమైన ప్రస్తుత మానవ జీవితంలో ఒత్తిడుల నుండి ఉపశమనం పొందేందుకు హాస్య నాటికలు దోహదపడతాయన్నారు. మరో ముఖ్యఅతిథి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నాటకరంగానికి రావులపాలెం సిఆర్‌సి 18 ఏళ్లుగా అందిస్తున్న చేయూత అభినందనీయమన్నారు. కళాపరిషత్‌లు కళాకారులకు ప్రేక్షకుల ప్రోత్సాహం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకుల రామకృష్ణ, ఎంపిపి కోట చెల్లయ్య, జడ్పీటిసి సాకా ప్రసన్నకుమార్, సిఆర్‌సి అధ్యక్షుడు నందం వీర వెంకటసత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి కర్రి శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ ఆర్‌విఎస్ రామాంజనేయరాజు, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, గొలుగూరి రామిరెడ్డి, పివిఎస్ సూర్యకుమార్, ద్వారంపూడి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మొదటిరోజు ప్రదర్శనలు
రావులపాలెం సిఆర్‌సిలో శుక్రవారం రాత్రి నుండి ప్రారంభమైన రాష్టస్థ్రాయి ఆహ్వాన హాస్య నాటిక పోటీల్లో మొదటి రోజు ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. హైదరాబాద్ కళాంజలి సంస్థ కళాకారులు ప్రదర్శించిన ‘ఇల్లాలి ముచ్చట్లు’ నాటిక ఆద్యంతం హాస్యభరితంగా సాగింది. సింగారి అనే చిరుద్యోగి డబ్బుపై వ్యామోహంతో చేసిన మోసం ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసిందో ఈ నాటిక ద్వారా దర్శకుడు కొల్లా రాధాకృష్ణ తెలిపారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి పేర్లను ఒక దినపత్రికలో చదివిన ఆమె వాటిలో తన భర్త పేరు ఉండడంతో, బతికున్న భర్తను దాచిపెట్టి చనిపోయినట్లు సాక్ష్యాలు సృష్టించి అధికారులను మోసంచేసి ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు సంపాదిస్తుంది. అయితే సినిమా పిచ్చి ఉన్న ఆమె తమ్ముడు ఒక డైరెక్టర్‌ను నమ్మి హీరోగా, నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని ఆ డబ్బు కాజేసి పరారవుతాడు. ఎప్పటికైనా కష్టార్జితమే మిగులుతుందని, అయాచితంగా వచ్చే డబ్బుకోసం ఆశ పడకూడదని భర్త ఆమెకు నచ్చచెప్పడంతో నాటిక ముగుస్తుంది. ‘అక్కల తామేశ్వరయ్య రచించిన ఈ నాటికలో శ్రీలక్ష్మి, కొల్లా రాధాకృష్ణ, లక్ష్మణ్, జమ నటించారు. అనంతరం కొలకలూరు కళాలయ వారిచే ‘ఎంతో చిన్నది జీవితం’ నాటిక ప్రదర్శితమైంది. ఈ నాటిక ద్వారా హాస్యాన్ని పంచడంతో పాటు రచయత, దర్శకుడు షేక్ హుస్సేన్ మంచి సందేశమిచ్చారు. గుడిని చూసి దేవుడికి నమస్కరించడం, శ్మశానం చూసి చావు గుర్తుకు రావడం, శ్రీకృష్ణుడు 16 వేల మంది గోపికలతో తిరిగాడు వంటివి కాకుండా ఏక పత్నీవ్రతుడైన శ్రీరామునిలా ఉండాలని మన పిల్లలకు నేర్పితే రేపు వారు మంచి మార్గంలో నడుస్తారని ఈ నాటిక ద్వారా సరదాగా చూపించారు. అలాగే ఆఖరిగా తూర్పుగోదావరి జిల్లా దివిలి శ్రీ శారదా ఆర్ట్స్ ‘్భలే నాటకం’ నాటకరంగంలోని కష్టాలను తెలియజెప్పాడు. గ్రామీణ నేపధ్యంలో నటనపై ఉన్న ఆసక్తితో కొందరు నాటక సమాజం ఏర్పాటు చేసుకుంటారు. టిక్కెట్‌తో నాటకం ప్రదర్శించాలని అనుకున్నా జనం రాకపోవడం ఒడిదుడుకులతో ఉచితంగా నాటకం ప్రదర్శిస్తారు. ఆ నాటకంలో పైడయ్య అనే రైతు కూతురు రాణిని హీరో అప్పారావు, విలన్ సత్తిరాజు ఇద్దరూ ప్రేమించడంతో త్రికోణ ప్రేమకథ నడుస్తుంది. ఈ నాటిక సుఖాంతం అయ్యే సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న పైడియ్య అసలు తండ్రి వీరభద్రయ్య వీరావేశంతో నాటక వేదికపైకి వచ్చి గలాటా చేయడంతో ప్రదర్శనకు బ్రేక్ పడుతుంది. దీంతో రచయత, దర్శకుడు అంజిబాబు తలబాదుకుంటాడు. జనం భలే నాటకం అనుకుంటూ వెళ్లిపోతారు. ఈ నాటికలను తిలకించేందుకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నాటిక పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సినీ గేయ రచయత అదృష్టదీపక్, అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోల్నాటి గోవిందరావు, ప్రొఫెసర్ జిఎస్ ప్రసాద్‌రెడ్డి వ్యవహరించారు.