తూర్పుగోదావరి

బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా పెద గెద్దాడ: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, డిసెంబర్ 2: ఏజన్సీలో పెద గెద్దాడ గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా త్వరలో ప్రకటించబడి ఏజన్సీలోని గ్రామాలకు ఆదర్శంగా నిలవబోతోందని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన రంపచోడవరం మండలంలో పర్యటించారు. ముందుగా రంపచోడవరంలోని సూపర్ బజార్ వద్దనున్న రేషన్ డిపోలో అరువుపై నిత్యావసరాల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత నెల నిత్యావసర వస్తువుల విలువను వచ్చే జనవరి రేషన్ సరుకుల ధరలతో చెల్లించాల్సి ఉంటుందన్నారు. డిఆర్ డిపోలలో ఎలక్ట్రానిక్ కాటాలు అమర్చాలని జిసిసి అధికారులను ఆదేశించారు. ధరల పట్టికను, సరుకుల నాణ్యతను ఆయన పరిశీలించారు. అనంతరం చిన గెద్దాడ గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో వాటిని ప్రారంభింపజేశారు. గ్రామంలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పెద గెద్దాడ గ్రామంలో సర్పంచ్ కత్తుల నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన నగదు రహిత చెల్లింపుల అవగాహనా సదస్సులో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. రూపే కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా స్వైపింగ్ మిషన్లను దుకాణాలు, బస్సులు, విద్యుత్తు ఛార్జీలు తదితర లావాదేవీలకు వినియోగించుకునే అవకాశాలను ప్రభుత్వం మెరుగు పరుస్తుందన్నారు. తప్పని సరిగా ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతా, రూపే కార్డు కలిగి ఉండాలన్నారు. గెద్దాడ పంచాయతీలో 284 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామని, ఇప్పటి వరకూ 150 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో మూడు వారాల్లో మిగిలిన వాటిని పూర్తిచేసి ఒడిఎఫ్ గ్రామ పంచాయతీగా ప్రకటించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఏజన్సీలో కమ్యూనికేషన్ నిమిత్తం 57 టవర్ల నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిక పంపించామని, త్వరలో అవి మంజూరవుతాయన్నారు. ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో నగదు రహిత లావాదేవీలు అనుసరించేలా ప్రభుత్వం ఇప్పటి నుండే చర్యలు చేపట్టిందన్నారు. ఎంపిపి సత్యనారాయణరెడ్డి సూచించిన విధంగా కొండరెడ్లకే కాకుండా మిగిలిన కులాల వారికి కూడా 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్లు వచ్చేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. అనంతరం గిరిజనులకు రూపే కార్డులు పంపిణీ చేశారు. కాగా గెద్దాడలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు, అంగన్‌వాడీ నిర్వాహణా తీరును పిఒ దినేష్‌కుమార్ పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రానికి నాసిరకం కోడి గుడ్లు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో చింతూరు పిఒ చినబాబు, ఇఇ నాగేశ్వరరావు, డిఇ శ్రీనివాసరావు, పిహెచ్‌ఒ శ్రీనివాసులు, ఎంపిడిఒ సరస్వతి, తహసీల్దార్ రామోజీ తదితరులు పాల్గొన్నారు.