తూర్పుగోదావరి

ప్రపంచానికే ఆదర్శం గోదావరి జిల్లాల అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, డిసెంబర్ 4:గోదావరి జిల్లాల అందాలు ప్రపంచానికే ఆదర్శమని, ఈ ప్రాంతంలో ఏ సినిమా నిర్మించినా అది ప్రజాదరణ పొందుతుందని సినీ,టివి నటుడు రాజీవ్ కనకాల అన్నారు. ఆదివారం మండల పరిధిలో గాంధీనగరంనకు చెందిన రాజ్‌కుమార్ నర్సరీ అధినేత దూలం రాజ్‌కుమార్ గృహం వద్ద స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ నేనూ ఈ జిల్లాల వాడినేని ఇతరులతో గొప్పగా చెప్పుకుంటానని, ఈ ప్రాంతం అన్నా, ఇక్కడివారన్నా తనకు ఎంతో గౌరవమని అన్నారు. ఈ ప్రాంతం సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశమని, ఇక్కడ షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు, దర్శకులు సెంటిమెంట్‌గా భావిస్తారని అన్నారు. ఈయన వెంట సిద్దిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతోనే విద్యాభివృద్ధి
మలికిపురం, డిసెంబర్ 4: ప్రతీ విద్యార్థి చదువుతోపాటు క్రీడలకు కూడా కొంత సమయం కేటాయించి మానసిక ఉల్లాసం పొందాలని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. గత మూడు రోజులుగా బట్టేలంక హైస్కూల్‌లో జరుగుతున్న రాజోలు జోన్ బాలుర గ్రిగ్ ఆటల పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి స్కూల్ ఆవరణలో హెచ్‌ఎం సిహెచ్ వీరభద్రానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందింపజేసి విద్యాభివృద్ధికి తోడ్పడతాయన్నారు. బట్టేలంక హైస్కూల్ నుండి తాను దత్తత చేసుకుని వారికి కావాల్సిన విద్యా సౌకర్యాలను సమకూర్చుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతి ప్రదానం చేయడమే కాకుండా పోటీలు నిర్వహణకు సహకరించిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి జి గంగాభవాని, స్థానక సర్పంచ్ కె కమలామణి, ఎంపిటిసి బోణం ఏసు, బండారు విజయకుమార్, జిఎన్‌ఆర్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ గెద్డాడ నాగేశ్వరరావు, ఎస్‌ఎంసి చైర్మన్ మేడా శ్రీనివాస్, పలు పాఠశాలల హెచ్‌ఎంలు, విద్యార్ధులు పాల్గొన్నారు