తూర్పుగోదావరి

ఎడమ గట్టుపై ఇసుక దందా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 18: అఖండ గోదావరి నది ఎడమ గట్టు కాతేరు, వెంకటనగరం గ్రామాల వద్ద ఇసుక దందా కొనసాగుతూనే వుంది.. అధికారులు చోద్యం చూస్తూనే వున్నారు.. ఎందుకంటే అధికార దర్పం మధ్య అధికారులు తమ పని తాము చక్కబెట్టుకుంటున్నారు. ఇసుక అక్రమాలు కొనసాగుతూనే వున్నాయి.. అధికారుల తీరు యధారాజా తధా ప్రజా అన్నట్టుగా వుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికక్కడ ఇసుక కొండలు వెలుస్తున్నాయి. నదిలోంచి తీసిన ఇసుకను అప్పటికపుడు జిల్లా పరిధిలో కావాల్సిన చోటకు రవాణా చేయాల్సి వుంది. ఇసుకను నిల్వ చేయడం అక్రమం. కానీ ఎక్కడికక్కడ అక్రమంగా నిల్వ చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కడియం మండలాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, కడియం మండలం వేమగిరి జంక్షన్‌కు సమీపంలోనూ పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్నా పట్టించుకున్న అధికార యంత్రాంగం కానరావడం లేదు. ఈ ప్రాంతాల్లో ఇసుక కొండలు పేరుకుపోయాయి. కొన్ని చోట్లయితే నిర్మాణంలో వున్న భవనాలకు సమీపంలోనే భారీ స్థాయిలో ఇసుకను నిల్వ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే ఎవరికి అనుమానం రాకుండా వుంటుందని ఇసుక మాఫియా ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. వేమగిరి సమీపంలోని జాతీయ రహదారిని అనుకునే యధేచ్ఛగా ఇసుకను అక్రమంగా నిల్వ చేసిన దాఖలాలు వున్నాయి.
రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలోని వెంకటనగరం, కాతేరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా నదిలోంచి తరలిస్తున్నారు. రాత్రికి రాత్రి వందలాది వాహనాల్లో ఇసుక అధికారుల కనుసన్నల్లోనే తరలిపోతోంది. ఈ ప్రాంతాల్లో ఇసుక తవ్వేందుకు ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు గ్రూపులు పెద్ద ఎత్తున ఇసుక దందాను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను రాత్రి సమయాల్లో యధేచ్ఛగా తరలిస్తున్నారు. రాజానగరం, కాతేరు తదితర ప్రాంతాల్లో నిల్వ చేసి భారీ ట్రిప్పర్ లారీలతో విశాఖ వైపు తరలిస్తున్నట్టు తెలిసింది. రెవెన్యూ, ఇరిగేషన్, గనుల శాఖల అధికారులతో పాటు పోలీసులకు కూడా తెలిసే ఇక్కడ ఇసుక దందా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పలుకుబడిని ఉపయోగించుకుని కోట్లాదిగా ఇసుక వ్యాపారం అక్రమంగా సాగుతున్నట్టు తెలిసింది.
సాగునీరు అందించడమే ధ్యేయం
భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమ
గండేపల్లి, మార్చి 18: సాగునీరు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమ అన్నారు. శనివారం గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలోగల పుష్కర లిఫ్ట్ పంపులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ కందుల కొండయ్యదొర, టిడిపి నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో పుష్కర కాలువ రూపుదిద్దబడిందన్నారు. ఇక్కడ ఉన్న పంపులు, పైపులైన్లు తాత్కాలికంగా పనిచేయకపోవడంతో వీటిస్థానే కొత్త పంపులు ఏర్పాటుచేసేందుకు 46.42 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన చెప్పారు. త్వరలో నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో 25వేల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. అదేవిధంగా మరోతొమ్మిది నెలల్లో పురుషోత్తపట్నం కాలువను కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేపడతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ ఇక్కడ లిఫ్ట్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతులకు పూర్తిస్థాయిలో నీరందించలేకపోయారని, ఈ సీజన్ పంటకు నీరందించకపోయినా వచ్చే పంటకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఇ ఎస్ సుగుణేశ్వరరావు, ఇఇ ఎ రాజేంద్రప్రసాద్, జెఇ కీర్తి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయిలో బిజెపి పటిష్టతపై దృష్టి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మార్చి 18: గుజరాత్ తరహాలో బిజెపిని గ్రామస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ సురేష్‌రెడ్డి సూచించారు. అమలాపురం బిజెపి పట్టణ, నియోజకవర్గ స్థాయిలో శనివారం వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన కార్యకర్తలు, నాయకులతో చర్చించారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించడంలో ప్రధాని నరేంద్రమేఢీ పాలనపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఎపిలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, వేటుకూరి సూర్యనారాయణరాజు, బసవా శివరామప్రసాద్, కర్రి చిట్టిబాబు, ఆర్‌వి నాయుడు, అయితాబత్తుల అభిషేక్, అడపా శ్రీనివాస్, బసవా చినబాబు, మోకా వెంకట సుబ్బారావు, యల్లమెల్లి కొండ, చిట్టూరి రాజేశ్వరి, ఆకుల వీరబాబు, నల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు.
రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
అయినవిల్లి / ముమ్మిడివరం, మార్చి 18: గ్రామీణ లింకు రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులు బడ్జెట్‌లో కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శనివారం ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు సెంటర్ నుండి అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామం మాగాం వరకూ కోటి 80 లక్షల రూపాయలతో ఆర్‌అండ్‌బి బిటి రోడ్డు నిర్మాణానికి ఆయన శిలాఫలకాన్ని రాజప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. దీనికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారన్నారు. సిరిపల్లి నుండి మునిపల్లి వరకూ బిటి రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారన్నారు. అదే విధంగా కత్తిపూడి నుండి కాకినాడ వరకూ నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయని, దీనికోసం ముందుగా వెయ్యికోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. అదే విధంగా కాకినాడ నుండి బోడసకుర్రు వరకూ బైపాస్ రోడ్డు నిర్మాణాల కోసం పనులు ప్రారంభించారన్నారు. అదే విధంగా నేషనల్ హైవే రోడ్లు, ఆర్‌అండ్‌బి ప్రధాన మెయిన్ రోడ్లు ప్యాచ్ వర్కులకు నిధులు విడుదల చేశామని, ఇప్పటికే పనులు జరుగుతున్నాయని రాజప్ప అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులపర్తి నారాయణమూర్తి, దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), అయితాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు, ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్‌పర్సన్ చెల్లి శాంతకుమారి, ఎంపిపి సలాది పుల్లయ్య నాయుడు, జడ్పీటిసి గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ, చెల్లి అశోక్, ఆర్ అండ్ బి ఇఇ ఎ శ్రీరామచంద్రరావు, డిఇఇ వై వెంకటేశ్వరరావు, పోతుకుర్రు సర్పంచ్ గుమ్మళ్ళ సాగర్, ఎంపిటిసి మెల్లం సత్యనారాయణ పాల్గొన్నారు.