తూర్పుగోదావరి

‘తూర్పు’లో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 15: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది..్భనుడు చండ ప్రచండ ఉగ్రరూపం దాల్చాడు..నిప్పులు చెరగడమంటే ఇదేనేమో అనిపించింది..వేడి వాయువులు చుట్టుముట్టాయి..రాత్రి ఏడు గంటల వరకు కూడా ముఖానికి అచ్ఛాదన లేకుండా బయటకు రాలేని స్థితి అలుముకుంది.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోనే ఈ సీజన్ మొదటి నుంచీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వాతావరణంలో వచ్చిన మార్పులుగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా గోదావరి నదిలో ఇసుక తినె్నలు విపరీతంగా బయటకు తేలడం, జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణలో భాగంగా రహదారుల పరీవాహంలో వృక్షాలను నరికివేయడం, సిసి రోడ్లు విపరీతంగా పెరిగిపోవడం, గ్రీనరీ మచ్చుకు కూడా కన్పించకపోవడం వల్ల విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోవడానికి కారణంగా చెబుతున్నారు. గత ఏడాది ఇదే రోజుల్లో 34 నుంచి 37 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో సోమవారం రాజమహేంద్రవరంలో జిల్లాలోనే అత్యధికంగా 43 డిగ్రీల గరిష్ణ, 28 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి తోడు గాలిలో తేమ పూర్తిగా హరించుకుపోయి కనీసం ఆకు కూడా అల్లాడని స్థితిలో తీవ్ర ఉక్కపోత అలుముకుంది. దీంతో జనం ఆపసోపాలు పడ్డారు. రాత్రి ఏడున్నర గంటల వరకు 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా ఈ సీజన్‌లో రికార్డుగా పేర్కొంటున్నారు. దీనికి తోడు వేడి తగ్గకపోవడంతో ఉక్కపోతతో జనం సతమతమయ్యారు. విపరీతమైన ఉక్కపోత ఆవరించడంతో జనం ఊపిరాడని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరో నాలుగు రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని అంచనా వేయడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటితే ఎసిలు కూడా పనిచేయని స్థితి ఎదువుతుందని తెలుస్తోంది.
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
జెసి మల్లికార్జున

కాకినాడ, మే 15: ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (జెసి) ఎ మల్లికార్జున ఆదేశించారు. సోమవారం జెసి జిల్లా కలెక్టరేట్‌లో మీకోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ప్రజల నుండి పలు ఫిర్యాదులను అందుకుని వారి సమస్యను నిశింతగా విన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 258 మంది హాజరై వారి విజ్ఞాపనలు, అర్జీలను జెసికి అందించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కలెక్టరేట్‌కు వస్తున్నారని అందువల్ల వారి సమస్యలు పరిష్కరించటానికి అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి సమస్యలకు సరైన మార్గం చూపాలని చెప్పారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలపై తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత కార్యాలయాలకు వెంటనే పంపి తీసుకున్న చర్యల వివరాలను నమోదు చేయాలన్నారు. సమస్యలు పరిష్కారంలో ఏ విధమైన జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను జెసి కోరారు. జెసికి అందిన అర్జీల్లో పించన్ల మంజూరు, ఇళ్ళ స్ధలాలు, గృహ నిర్మాణం వంటి వాటిపై అధికంగా అందాయి. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఓ ఎం జ్యోతి, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, జడ్పి సిఇఓ కె పద్మ, డిఎస్‌ఓ వి రవికిరణ్, డిఇఓ ఎస్ అబ్రహం, ఎస్‌ఎస్‌ఎ పిఓ ఎం శేషగిరి, సివిల్ సప్లయిస్ డిఎం ఎ కృష్ణారావు పాల్గొన్నారు.