తూర్పుగోదావరి

విలీన మండలాల్లో నేడు ముఖ్యమంత్రి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడు, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం ముఖ్యమంత్రి నిమ్మలగూడెంకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 10-35 గంటల నుండి 11 గంటల వరకు ఉపాధి హామీ పనులు పరిశీలించి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అనంతరం చంద్రబాబు చింతూరులోని ఎర్రంపేట ఉదయం 11 గంటలకు సబ్ ట్రెజరీని ప్రారంభిస్తారు. జిసిసి పెట్రోల్ బంక్, ఎల్‌పిజి గోడౌన్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం విలీన మండలాల కోసం ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక ఐటిడిఎని ప్రారంభిస్తారు. ప్రాజెక్టు అధికారి క్వార్టర్, స్ట్ఫా క్వార్టర్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. తదుపరి కూనవరం, చింతూరు పిహెచ్‌సి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. చింతూరు నుండి విఆర్ పురం, నెల్లిపాక నుండి పోచవరం ఆర్ అండ్ బి రోడ్డు పనులకు సిఎం శంకుస్థాపన చేస్తారు. ఆర్‌డబ్ల్యుఎస్ పనులకు, ఆర్టీసి డిపోకు సిఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎపి రెసిడెన్షియల్(గిరిజన సంక్షేమ) జూనియర్ కళాశాలకు ముఖ్యమంత్రి చేరుకుని ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శిస్తారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 17 వేల ప్రైమ్ టు ట్రైబల్ గ్రూప్ కుటుంబాలకు చంద్రన్న పౌష్టికాహార కానుకను ప్రారంభించి అందజేస్తారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు, దీపం కనెక్షన్లు, ఉపకరణాలు పంపిణీ చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 2-30 గంటలకు నిమ్మలగూడెం నుండి హెలికాప్టర్‌లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరు వెళతారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఏజెన్సీ, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో సాయుధ బలగాలను మోహరించారు.