తూర్పుగోదావరి

నిరుపేద మహిళలకు తొలగిన వంట కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 19: నిరుపేద మహిళలకు వంట కష్టాలు తొలగిపోయాయి. రాజమహేంద్రవరం నగరంలో సుమారు మూడువేల నిరుపేద మహిళలకు ఇటీవల కాలంలో ఉచిత గ్యాస్ అందించారు. ప్రభుత్వాలు అందించిన సంక్షేమం నేపథ్యంలో తమకు ఉచిత గ్యాస్ లభించినందుకు చాలా సంతోషంగా వుందని, కట్టెల పొయ్యి వంట కష్టాలు తొలగిపోయి పిల్లలను త్వరగా స్కూళ్లకు పంపగలుగుతున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఐదు గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం వంట గ్యాస్ కనెక్షన్లు అందించింది. ఇప్పటివరకు కట్టెల పొయ్యితో చాలా కష్టాలు పడ్డామని, ప్రభుత్వం తమకు రూ.800 చెల్లించగా గ్యాస్ సిలిండర్, గ్యాస్ ట్యూబ్, రెగ్యులేటర్ అందించిందని స్థానిక బర్మా కాలనీకి చెందిన ముత్తి వెంకట రమణమ్మ, కప్పల సురేఖ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్యాస్ కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నామని, అయితే ఇప్పటికే ఎవరి సిఫార్సులు లేకుండానే తమకు గ్యాస్ అందిందని చెప్పారు. ప్రభుత్వం అందించిన వంట గ్యాస్ వల్ల వంట కష్టాలు తొలగిపోయాయని, సకాలంలో వంట చేసి పిల్లలను చదువుకు పంపించగలుగుతున్నామని మహిళలు చెబుతున్నారు. పౌర సరఫరాల అధికారి ప్రసాద్ పర్యవేక్షణలో వంట గ్యాస్ అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

గండేపల్లి, జూన్ 19: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ దుర్గా శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన మంతెన శ్రీను, కొండయ్య అనే ఇరువురు మోటారు సైకిల్‌పై గండేపల్లి వస్తుండగా మల్లేపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి ఆగివున్న లారీని వెనుక నుండి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కుమారుడు మంతెన శ్రీను (35) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి కొండయ్య తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వీరు నడుపుతున్న మోటారు సైకిల్ లారీ కింద ఇరుకుపోయింది. మృతుడ్ని, క్షతగాత్రుడ్ని 108లో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.
రామచంద్రపురంలో మరుగుజ్జుల వివాహం
రామచంద్రపురం, జూన్ 19: స్థానిక పదంవారి వీధిలో క్రీస్తు సంఘం ప్రార్థనాలయంలో సోమవారం మరుగుజ్జుల వివాహం అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పాస్టర్ నందిక ప్రసాద్ ఈ వివాహ మహోత్సవాన్ని ఆహూతుల సమక్షంలో కన్నుల పండువగా నిర్వహించారు. పెద్దల సమక్షంలో వరుడు పులిదిండి తాతారావు, వధువు బూల మాధవిలకు వివాహం జరిగింది. కొమ్ము అబ్బులు, నాగేశ్వరరావు, సురేష్, మడికి భాను, చాపల సత్యనారాయణ, తదితరులు ఈ కార్యక్రమానికి సారధ్యం వహించారు. వరుడు కాకినాడకు చెందిన వ్యక్తి కాగా, వధువు వేళంగి గ్రామ వాస్తవ్యురాలు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పదానికి ఈ వివాహం ఖచ్చితంగా అన్వయం జరిగిందని వివాహ వేడుకలను చూసిన ప్రజలు, క్రైస్తవ మతారాధకులు పేర్కొనడం విశేషం.