తూర్పుగోదావరి

రెండేళ్లలో 10 లక్షల గృహాల నిర్మాణం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, జూన్ 19: రానున్న రెండేళ్ల కాలంలో రాష్టవ్య్రాప్తంగా పది లక్షలకు పైగా గృహాలు నిర్మించడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్ ఇళ్లు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 38 పురపాలక సంఘాల్లో పలు ప్రాంతాల్లో ఒకే రోజున లక్షా యాభైవేల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. పేదవారికి అందమైన, సకల సౌకర్యాలు గల, విలువైన ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేంద్రం మంజూరు చేసిన 1,93,147 ఇళ్లు సకాలంలో పూర్తిచేసి మరో రెండు లక్షల ఇళ్లు మంజూరు కోరుతూ ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామన్నారు. నాణ్యత, నిర్మాణాల్లో పారదర్శకత కోసం దేశంలోనే పేరెన్నికగన్న ఐదు నిర్మాణ కంపెనీలకు ఎన్టీఆర్ నగరాలు నిర్మాణ కాంట్రాక్టులు అప్పగించామన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్ల నిర్మాణం ఉంటుందన్నారు. రాష్ట్రంలో చేపట్టే గృహనిర్మాణాలు దేశానికి ఆదర్శంగా ఉండేలా రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి అదనంగా నిధులు కావాలని కోరారు. అనంతరం హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు మూడువేల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇప్పటికే మరో రెండువేల ఇళ్లు వ్యక్తిగత నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అందరికీ ఇళ్లు పధకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. కేంద్ర పథకానికి రాష్ట్రం కూడా సబ్సిడీని జోడించి, ఎన్టీఆర్ నగరాలుగా నామకరణం చేసి గృహనిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. కాలనీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, షాపింగ్ కాంప్లెక్స్, అర్బన్ హెల్త్ సెంటర్, ప్రాథమిక పాఠశాల, ఆర్వో ప్లాంట్, విద్యుత్ సౌకర్యం, విశాలమైన వీధులు, సిసి రోడ్లు, డ్రెయిన్లు, స్వచ్ఛ్భారత్ స్ఫూర్తిగా, పచ్చదనం పెంపకం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు (15 నెలలు)లో జిల్లాలో అందరికీ ఇళ్లు పథకంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. హౌసింగ్, రెవిన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధి, విద్యుత్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాల మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సిఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. నిర్మాణ పనులపై వారం వారం ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే కాంట్రాక్టులు రద్దవుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో విశే్వశ్వరరావు, మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, కమిషనర్ శేషాద్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.