తూర్పుగోదావరి

సంక్షేమ పథకాలు అమలులో నిర్లక్ష్యం సహిస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూన్ 19: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వీటిని ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. సోమవారం రావులపాలెంలోని 2వ నంబరు రేషన్ దుకాణంలో ఆయన రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అందజేస్తున్న చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమానికి ఆయన రాగానే లబ్దిదారులు సంఖ్య అంతంత మాత్రంగా ఉండటంతో గ్రామంలో ఎంతమందికి రంజాన్ తోఫా కిట్లు మంజూరయ్యాయని తహసీల్దారు సిహెచ్ ఉదయ భాస్కర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ 123 మంది లబ్దిదారులకు కిట్లు మంజూరైనట్టు చెప్పారు. అయితే అక్కడ కేవలం ముగ్గురు లబ్దిదారులు మాత్రమే ఉండటంతో రెడ్డి సుబ్రహ్మణ్యం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని 9 రేషన్ దుకాణాల్లో 123 మంది లబ్దిదారులకు కిట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం ముగ్గురికి సమాచారం ఇవ్వడమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లు కూడా తమ పరిధిలోని లబ్దిదారులను కార్యక్రమానికి తీసుకురాకుండా నిర్లక్ష్యం వహించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు వారధిగా పనిచేయాల్సి ఉంటుందని, ఈవిధంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక సమయంలో అధికారుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుండి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో ఆయన లబ్దిదారులకు తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి, ఎఎంసి మాజీ ఛైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి, జక్కంపూడి వెంకటస్వామి, కుడుపూడి శ్రీనివాస్, గుత్తుల పట్ట్భా రామారావు, దాసరి వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.