తూర్పుగోదావరి

పాదగయలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, సెప్టెంబర్ 21: ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయలో గురువారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకే ప్రత్యేక పూజలు చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ దంపతులు కలశస్థాపన పూజలో పాల్గొన్నారు. తొలుత విఘ్నేశ్వరపూజ అనంతరం కుక్కుటేశ్వరస్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారు తొలిరోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిచ్చారు. శుక్రవారం నుంచి మిగిలిన అవతారాలలో దర్శనమిస్తారని ఇఒ చందక దారబాబు తెలిపారు. నవ అవతారాల్లో అమ్మవారిని అలంకరించేందుకు చీరలను ఎమ్మెల్యే దంపతులు అందజేశారు. ఆలయంలో పురూహుతికాశక్తిపీఠంలో లక్ష కుంకుమార్చనలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పండితులు మంత్రోచ్ఛరణల నడుమ పాదగయలోని ఉపాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు జరిగాయి. పూజల్లో ఆలయ ఛైర్మన్ కొండేపూడి ప్రకాష్, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను అనాథలను చేయడం అన్యాయం

విసి ముత్యాలనాయుడు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: భారతదేశ సంస్కృతి తల్లిదండ్రులకు విశిష్ట స్థానం కల్పించిందని, ఈ ధరణిపై కనిపించే దైవంగా వారిని కొలిచే గొప్ప సంస్కృతి గల దేశంలో పుట్టి నేడు తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాల్జేయడం అన్యాయమని ఆదికవి నన్నయ యూనివర్శిటీ విసి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విసి ఆచార్య ముత్యాలనాయుడు మదర్‌థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్ధించే పెదవులు కన్న సాయం చేసే చేతులు మిన్న అంటూ సేవలకు ప్రతిరూపంగా నిలిచిన మదర్‌థెరిస్సాను ఆదర్శంగా తీసుకుని అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్‌ఎస్‌ఎస్ విభాగానికి సూచించారు. అభివృద్ధి దిశగా అడుగులు పడే కొద్ది ఆప్తుల మధ్య దూరం పెంచుకుంటున్నామని, ఇది మంచి సంస్కృతికాదని చెప్పారు. నాగరికత పెరిగే కొద్దీ అనాథాశ్రమాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులను వదిలివెళ్లే దుష్ట సంస్కృతి నుంచి దూరంగా నేటితరం యువత ఉండాలన్నారు. పేద వృద్ధులకు ఉడతాభక్తిగా సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ బృందాన్ని, స్వర్ణాంధ్ర సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబును విసి అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ కిరణ్ చంద్ర, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఆర్ జానకీరావు, డాక్టర్ పి లక్ష్మీనారాయణ, డాక్టర్ వరహాలదొర, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.