తూర్పుగోదావరి

ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు తొలిరోజు శ్రీబాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన దేవీచౌక్‌లో గురువారం కలశస్థాపనతో పూజలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు జరిపారు. గురువారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కనకదుర్గ మహత్యం నాటకాన్ని ప్రదర్శించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దేవీచౌక్‌ను రంగురంగుల విద్యుత్‌దీపాలు, ఆకర్షణీయమైన బొమ్మలతో అలంకరించారు. అలాగే నగరంలోని పలు ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రంగురంగుల విద్యుత్‌దీపాలతో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, పూజలు నిర్వహిస్తున్నారు.

రహదారులపై ఆక్రమణలు తొలగించాలి
*రహదారి భద్రతా కమిటీ సమావేశం
రామచంద్రపురం, సెప్టెంబర్ 21: ప్రధాన రహదారులపై ఆక్రమణల పర్వం జరగకుండా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలు జరిగిన ప్రాంతాల్లో వాటిని తొలగించేందుకు శాఖాపరంగా సమిష్టి కృషి నిర్వహించాలన్న లక్ష్యాన్ని రహదారి భద్రతా కమిటీ సమావేశం ఏర్పరుచుకుంది. రామచంద్రపురం ఆర్డీవో కె సుబ్బారావు అధ్యక్షతన గురువారం సాయంత్రం ఆర్డీవో ఛాంబర్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ, ఆర్టీవో డి అశోక్‌కుమార్ (కాకినాడ), ఎంవిఐలు జి సంజీవకుమార్, ఎవివి సత్యనారాయణ, ఆర్‌అండ్‌బి డిఇ మధుసూధనరావు, సిఐలు ఎస్ రాంబాబు, ఎస్ లక్ష్మణరెడ్డి, కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్, ఎస్‌ఐలు వి సురేష్, మహ్మద్ నజీరుల్లా, ఆర్టీసీ డిఎం రోణంకి సీతారామనాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయే ప్రదేశాలలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో.. ఆయా ప్రాంతాలలో నివారణా చర్యలు చేపట్టేందుకు సమావేశం తీర్మానించింది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైన ప్రదేశాలలో వేగనియంత్రణ చర్యలు చేపట్టేందుకు కమిటి సిఫార్సు చేసింది. జడ్ మేడపాడు వద్ద ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. పంచాయితీ నేతృత్వంలో ఆ ప్రాంతంలో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేయడం ద్వారా పలు ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉన్నట్లు సమావేశం పేర్కొంది. జన్మదినోత్సవాలు, వర్ధంతులకు సంబంధించి ఫ్లెక్స్ బోర్డుల ఏర్పాటు ఇటీవల కాలంలో పెచ్చుమీరిందని, ఆయా కార్యక్రమాలు జరిగిన అనంతరం వాటిని తొలగించే చర్యలు చేపట్టకపోతే.. సంబంధిత గ్రామస్థాయి అధికారులు వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సభ్యులు సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ద్విచక్ర మోటార్ వాహనాలను వారి తల్లిదండ్రులు ఇవ్వద్దని ఇటీవల జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని సమావేశం సమర్ధించింది. అదేవిధంగా 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి మోటార్ చోదక లైసెన్స్‌ను అందించేందుకు విద్యాసంస్థల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. రహదారి భద్రత అంశాలకు సంబంధించిన కరపత్రాలను ప్రచురింపచేయించేందుకు వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలుతో కృషి చేద్దామని సమావేశం అంగీకారానికి వచ్చింది. అంతేకాకుండా బ్లాక్ స్పాట్‌ల అంశంపై కూడా కమిటీ సభ్యులు చర్చించారు.