తూర్పుగోదావరి

అబ్బురపరస్తున్న ఆనపకాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జనవరి 21: రావులపాలెంలోని ఒక వ్యాపారి స్థలంలో ఆనప పాదు భారీ స్థాయిలో కాయలు కాస్తూ అబ్బురపరుస్తోంది. స్థానిక సీఆర్సీ జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న చెక్కల సూరిబాబుకు సీఆర్సీ రోడ్డులో ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో కొంత కాలంగా దేశవాళీ ఆనప పాదులు పెంచుతున్నాడు. కాగా కొద్దిరోజులుగా పంటకొచ్చిన పాదు పెద్ద సైజులో కాయలు కాస్తోంది. సాధారణంగా 5 కేజీలు బరువు మించని ఆనప కాయలు, ఇక్కడ మాత్రం సుమారు 10నుంచి 15 కేజీలు బరువు తూగుతుండడం అబ్బురపరుస్తోంది. స్థానికులు వీటిని చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
రేపు జేఎన్‌టీయూకే స్నాతకోత్సవం

కాకినాడ, జనవరి 21: కాకినాడ జెఎన్‌టియు ఆరవ స్నాతకోత్సవం (కాన్వొకేషన్)ను ఈనెల 23న నిర్వహించనున్నారు. వర్సిటీ ప్రాంగణంలో ఆరోజు ఉదయం 10.30 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ సహా అధికారులు, ఆచార్యులు పాల్గొంటారు. స్నాతకోత్సవంలో భాగంగా ప్రతిభావంతులైన పరిశోధకులు, విద్యార్థులకు డాక్టరేట్లు, పట్టాలు, బంగారు పతకాలను బహుకరిస్తారు.