తూర్పుగోదావరి

ఆర్‌ఎంఎస్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జనవరి 21: సుమారు 30 ఏళ్లుగా ఎటువంటి గుర్తింపునకు నోచుకోకుండా రైల్వే మెయిల్ సర్వీసు (ఆర్‌ఎంఎస్)లో కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని నేషనల్ యూనియన్ ఆఫ్ ఆర్‌ఎంఎస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ యూనియన్ కార్యదర్శి కె శామ్యూల్ డిమాండ్ చేశారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌కు ఆనుకునివున్న ఆర్‌ఎంఎస్ కార్యాలయంలో ఆర్‌ఎంఎస్ వి డివిజన్ పరిధిలోని ఆరు కార్యాలయాలకు చెందిన యూనియన్ల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలిండియా ఆర్‌ఎంఎస్, ఎంఎంఎస్ డివిజన్ కార్యదర్శి ఎం మన్మధరావు అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ మాట్లాడుతూ 1986వ సంవత్సరం నుండి కార్మికులు ఆర్‌ఎంఎస్‌లో అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తుండగా, 2016 నుండి ఎటువంటి నియామకాలు చేపట్టలేదన్నారు. దానికి తోడు ప్రస్తుతం వున్న ఆర్‌ఎంఎస్ కార్యాలయాలను ఎత్తివేసి కార్మికులను వీధిన పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు జరగుతున్న అన్యాయాలపై కోర్టులను ఆశ్రయించినా, ప్రశ్నించినా వారు తమ వద్ద పనిచేయడం లేదని చెబుతూ జవాబులు ఇస్తూ తప్పించుకుంటున్నారన్నారు. ఆర్‌ఎంఎస్‌ల మూసివేత ప్రక్రియను ఆపివేయాలని, అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులు జీతం స్కేల్ రూ.18 వేలను, రూ.26వేలకు పెంచాలని, అలిండియా నాయకత్వం సూచనల మేరకు కార్మికులకు హెచ్‌ఆర్‌ఎ, అలవెన్సులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. తమ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న జిల్లా మానవహక్కుల సంఘం నాయకులకు వారు కృతజ్ఞతలు చెప్పారు. కాగా ఈ సమావేశంలో జిల్లా మానవహక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, నాయకులు ఎస్ రెహ్మన్, జుత్తుక అప్పారావు, కార్మిక యూనియన్ రాష్ట్ర నాయకులు రాజ్‌కుమార్, డివిజన్ నాయకులు కెవివి అప్పారావు, కె ప్రతాప్ కుమార్, తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం రెండేళ్లకొకసారి నిర్వహించే డివిజన్ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. ఆల్‌ఇండియా ఆర్‌ఎంఎస్/ఎంఎంఎస్ గ్రూపు-సి విశాఖపట్నం డివిజన్ బ్రాంచి అధ్యక్షులుగా ఎకె రాజేశ్వరరావు, సెక్రటరీ ఎన్ నరసింహరావు, కోశాధికారి బి శేఖర్, ఎంప్లాయిస్ యూనియన్ ఎంటిఎస్ మెయిల్ గార్డు విశాఖపట్నం డివిజన్ అధ్యక్షునిగా డి నర్సింగరావు, కార్యదర్శి కెకెవి అప్పారావు, కోశాధికారిగా డి వికాస్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సమావేశానికి రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం, ఏలూరు ఆర్‌ఎంఎస్‌లకు చెందిన యూనియన్ నాయకులు పాల్గొన్నారు.