తూర్పుగోదావరి

రానుంది పోరాటాల కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలమంతా పోరాటాల కాలమని సీపీఐ జిల్లా మహాసభలో పలువురు వక్తలు పేర్కొన్నారు. వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాద ఐక్య ఉద్యమాలకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ 24వ జిల్లా మహాసభలు రాజమహేంద్రవరంలో శుక్రవారం జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఓబులేసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీల పోరాట కార్యాచరణ ఏప్రిల్ 25 నుంచి 29 వరకు కేరళలోని కొల్లాంలో జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో రూపొందనుందని తెలిపారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ ప్రత్యామ్నాయ ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. అమిత్‌షా కుమారుడు జయంతిషా కేవలం రూ. 50వేల పెట్టుబడితో ఏడాది కాలంలో రూ.8వేల కోట్లు ఎలా సంపాదించారో ప్రధాని మోదీ ఈ దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్ ఈ దేశ ప్రజలపై విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. లౌకికవాద ప్రజాతంత్ర శక్తులు ప్రత్యామ్నాయ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయని, మోదీ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలంతా వామపక్ష పోరాటానికి మమేకం కావాలన్నారు. బడ్జెట్ కోసం విమర్శలు చేస్తోన్న చంద్రబాబునాయడు నాలుగేళ్ళపాటు బీజేపీ చెప్పుల్లో కాళ్లెట్టుకుని తిరిగాడన్నారు. బడ్జెట్‌లో పెట్టకపోయినప్పటికీ పోలవరానికి రూ.12వేల కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. రాజధాని భ్రమలు కల్పిస్తున్నారని, 53వే ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు రాజధాని పేరుతో దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయాలకు వేదికగా వామపక్షాలు నడుంబిగించాయన్నారు. ఈ దేశానికి ఎర్రజెండా ఒకటే మోక్షం కల్పిస్తుందన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాటల మాంత్రికుడు మోదీ త్రిపురలో పిట్టల దొర వేషం వేసుకుని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన మాటలు కోటలు దాటుతుంటే, ఆచరణ గడప దాటడం లేదన్నారు. అడిగినందల్లా ఇస్తామన్న మోదీ చివరికి బడ్జెట్‌లో వంచనకు గురి చేశారన్నారు. పోలవరంలో అన్యాయం చేస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రత్యేక హోదా సాధించి ఉంటే పారిశ్రామివేత్తలంతా రాష్ట్రం చుట్టూ తిరిగేవారన్నారని, ప్రస్తుతం వారి చుట్టూ చంద్రబాబునాయుడు తిరిగే అగత్యం లేకుండా వుండేదన్నారు. మోదీ అనాలోచిత నిర్ణయంతో 182 మంది గుండాగి చనిపోయారని ఆరోపించారు. మోదీపై 102 సెక్షన్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. కేంద్రం అధికారంలో ఉండే నైతికత కోల్పోయిందన్నారు. ఒకరోజు కూడా అధికారంలో ఉండే నైతికత లేదని వామపక్షాల పిలుపునందుకు చేసే పోరాటాలకు ప్రజలు మమేకం కావాలన్నారు. రానున్న కాలమంతా పోరాటాల కాలమని, గత మూడేళ్ళుగా సీపీఐ ప్రజాపక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటాన్ని సాగిస్తూనే ఉందన్నారు. కేంద్రంలో బొమ్మా బొరుసు పార్టీలు రాజ్యమేలుతుంటే, రాష్ట్రంలో పొద్దు తిరుగుడు నేతలు ఎక్కువైపోయారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ లౌకికవాదం అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలన్న మంత్రి ఆనందకుమార్ హెగ్డే మంత్రి వర్గంలో కొనసాగే నైతికత లేదన్నారు. మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు వామపక్షాలు ఐక్య ఉద్యమాలకు శంఖారావం పూరించాయన్నారు. రాష్ట్రంలో బాబు, జగన్ లాలూచీ కుస్తీపడుతున్నారన్నారు. మోదీ కాళ్ల ముందు మోకరిల్లుతున్నారన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని సీపీఐ పార్టీ గళమెత్తిందన్నారు. తమిళనాడు తరహా పోరాట స్ఫూర్తితో ప్రత్యేక హోదాకు కృషి చేయాలన్నారు. పోలవరం బాధితులకు సీపీఐ అండగా వుంటుందన్నారు. బాబును బోనులో నిలబెట్టాల్సింది పోయి వైసీపీ పాదయాత్రలంటూ పలాయనం చిత్తగించిందన్నారు. ఈ జిల్లా మహాసభల సందర్భంగా జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించిన సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని, జిల్లా సమగ్రాభివృద్ధికి పోరాటం సాగించేందుకు కార్యాచరణ తీసుకున్నామన్నారు. సమావేశంలో నాయకులు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి, నాయకులు చెలికాని స్టాలిన్, ముప్పాళ్ళ సుబ్బారావు, నల్లా రామారావు, నక్కా శ్రీనివాస్, కె అంజిబాబు, యడ్ల అప్పారావు, మహంతి లక్ష్మణరావు, యడ్ల లక్ష్మి, ఎం నాగమణి, సేపేని రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. పల్లె సుద్దులు, ప్రజా సమస్యలపై స్కిట్లు ఆకట్టుకున్నాయి.