తూర్పుగోదావరి

పదవీ విరమణ పొందిన రోజునే ప్రభుత్వ రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 16: పోలీసుశాఖలో పనిచేసిన ఉద్యోగులందరికీ పదవీ విరమణ పొందిన రోజునే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలను అందజేస్తామని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం సహజమని, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం సిబ్బంది పోలీసు శాఖకు దూరం అయినట్టుగా భావించరాదని, ఏ సమస్య వచ్చినా తక్షణం సంప్రదించవచ్చని, లేకుంటే ఫోన్‌చేసి సమస్యలు తెలియజేయవచ్చని ఎస్పీ విశాల్‌గున్నీ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. పదవీ విరమణ చేసిన సీఐ, ఐదుగురు ఎస్సైలు, ఆరుగురు ఎఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను ఎస్పీ విశాల్ గున్ని, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డిలు ఘనంగా సత్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో డీఎస్పీలు ఆర్ విజయభాస్కర్‌రెడ్డి, మురళీమోహన్, అధికారులు రాజారావు, రాజు, సూర్యారావు, పోలీసు యూనియన్ అధ్యక్షుడు బ్రహ్మాజీ, బలరామ్, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.