తూర్పుగోదావరి

వ్యర్థాల నిర్వహణకు యూనిట్లు ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 16: జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో వ్యర్ధ పదార్థాల నిర్వహణ (సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్) యూనిట్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఈ యూనిట్ల నిర్వహణ అవసరమని, అదే విధంగా ప్రతీ పట్టణ ప్రాంతానికి డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత ఆర్డీవోలు సమన్వయంతో డంపింగ్ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలన్నారు. జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలను ఇంటింటి నుండి సేకరించి వాటిని తడి చెత్త, పొడి చెత్తగా విడదీసి వ్యర్థ పదార్థాల నిర్వహణ చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్వహణను మెరుగుపర్చాలని, వీటి నిర్వహణపై ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. అదే విధంగా కమ్యూనిటీ మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే కొత్తగా కమ్యూనిటీ మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పట్టణాల్లో వీధిదీపాల నిర్వహణ, మొక్కలు నాటడం వంటి పరిరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ప్రభుత్వం సూచించిన విధంగా భవనాల నిర్మాణాలకు అనుమతులను ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. పట్టణాల్లో నూరుశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. సాలిడ్‌వేస్ట్ నిర్వహణలో భాగంగా సేకరించిన చెత్తతో కంపోస్టు, ఆర్గానిక్ ఎరువులు తయారయ్యే యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. గొల్లప్రోలుకు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా ఉన్నందున రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలని మున్సిపల్ ఆర్డీని ఆదేశించారు. పనులకు కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి విశేష కృషి
రాయవరం, ఫిబ్రవరి 16: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషిచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శఉక్రవారం మండలంలోని సోమేశ్వరం, లొల్ల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని కూడ లేని రాష్ట్రానికి దిశానిర్దేశం చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందన్నారు. రాష్ట్రంలో 15 వేల కిమీ మేర సీసీ రోడ్లు నిర్మించిన ఘనత కూడ ముఖ్యమంత్రిదేనన్నారు. అలుపెరగక రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా నిలిచి మరోమారు పట్టం కట్టాలని కోరారు. లొల్లలో జరిగిన సమావేశంలో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ పింఛను ఇచ్చి ప్రతి కుటుంబానికి బాసటగా నిలవడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. తొలుత వెంటూరులో సుమారు 2.1 కోట్ల రూపాయలతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషనుకు మంత్రి భూమిపూజ చేశారు. సోమేశ్వరంలో 2.3 కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేశారు. మాజీ సర్పంచ్ శాకా సత్తిరాజు (పెద్ద కాపు) చిత్రపటాన్ని ఆవిష్కరించి నివాళి అర్పించారు. లొల్లలో 14 లక్షలతో నిర్మించిన పంచాయితీ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కూర్మాపురం అబ్బు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వీర్రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వంక సాయికుమార్‌బాబు, ఎంపీపీ మాకన మీనాక్షి, సోమేశ్వరం సర్పంచ్ వై రాజ్యలక్ష్మీ పరమహంస, లొల్ల సర్పంచ్ పాండ్రాకుల గంగరాజు, ఎంపీటీసీలు ఆనాపు సత్యవతి, దేవు వెంకట్రాజు, మండల పార్టీ అధ్యక్షుడు కొవ్వూరి రాజగోపాలరెడ్డి, రామచంద్రపురం ఆర్డీవో ఎన్ రాజశేఖర్, తహసీల్దారు వడ్లమాని సీత, ఎంపీడీవో ఎ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలో రెండు సబ్‌స్టేషన్లు మంజూరు చేసినందుకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మంత్రి వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులపై విచారణ
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 16: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఉద్యోగులుపై ఉన్నతాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతిపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ శాఖ ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సంచాలకులు ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న పరిపాలనాధికారి కేసీహెచ్ రాజులు, ఎస్టాబ్లిష్‌మెంట్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వరరావు, వైద్యుల రికార్డులను పరిశీలించే సీనియర్ అసిస్టెంట్ ఎం లక్ష్మణమూర్తిలపై విచారణ జరిపారు. రాజమహేంద్రవరం వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుల ఆదేశాలతో జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వెంకటరత్నం శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఈవిచారణకు ఆరోణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులతోపాటు సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరై తమ వాదనలు వినిపించారు. ఈసందర్భంగా విచారణాధికారి వెంకటరత్నం మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఉద్యోగులపై పూర్తి విచారణ నిర్వహించామని, ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఉద్యోగులు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులకు సంబంధించిన ఏ పని చేయాలన్నా, పోస్టుల భర్తీ విషయంలోను, అవుట్‌సోర్సింగ్ నియామకాలు, డిప్యూటేషన్లు, పదోన్నతులు, ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగుల బదిలీలు అంశాల్లో వీరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఉద్యోగ సంఘాలు ఆరోపణలు చేశాయి. వీరు చేస్తున్న అవీనితిపై గతంతో పలుమార్లు ఉద్యోగ సంఘాల డీఎండీహెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. విచారణకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రజా వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్‌రావు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ సంఘం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు, సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వ ఆదేశాలపై డాక్టర్ వెంకటరత్నం విచారణ జరుపుతున్నారని చెప్పారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులుపై తమ సంఘం ఉద్యమం చేస్తుందని, ప్రస్తుతం డీఎండీహెచ్‌వో కార్యాయంలో పనిచేస్తున్న ఉద్యోగులు రాజులు, వెంకటేశ్వరరావు, లక్ష్మణమూర్తిలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరి చేస్తున్న అవినీతిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరం అయితే నిరాహార దీక్షను సైతం చేపట్టడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.

గ్రామాల్లో వెలగని ఎల్‌ఈడీ దీపాలు
*చీకట్లో అవస్థలు పడుతున్న గ్రామస్థులు
అయినవిల్లి, ఫిబ్రవరి 16: ఉన్నదాన్ని ఊడగొట్టి గ్రామాలను చీకటి మయం చేసిన విధంగా తయారైంది గ్రామాల్లో ఎల్‌ఈడి దీపాల పరిస్థితి. ఈ దీపాలు వేసిన రెండు రోజులకే చీకటి కమ్ముకోవడంతో గ్రామస్థులు మండి పడుతున్నారు. ఇటీవల అయినవిల్లి మండలంలో 21 గ్రామాల్లో ఎల్‌ఈడి దీపాలు వేశారు. అయితే వీటిని ఏర్పాటు చేయడానికి కాంట్రాక్టు సిబ్బంది రోజుకు ఎన్ని దీపాలు వేస్తే అంత సొమ్ములు వారికి ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో వారు దీపాలను వేయడానికి సులువు మార్గాన్ని ఎంచుకోవడంతోగ్రామాల్లో దీపాలు వెలగకపోవడానికి కారణమని గుర్తించారు. ఎల్‌ఈడి దీపాలతోపాటు కనక్టర్‌ను కూడా ప్రభుత్వం సప్లయ్ చేసింది. ఈకనక్టర్ నుండి అల్యూమినియం వైరుతో ఎల్‌ఈడి దీపాలు విద్యుత్ లైనుకు అమర్చవలసి ఉంది. ఈవిధంగా చేస్తే దీపాలు వేయడానికి ఎక్కువ వ్యవధి పడుతుందని ఎల్‌ఈడి దీపాలకు కనక్టర్‌ను తీసేసి డైరక్టగా కాపర్ వైరును అల్యూమినియం వైరుకు కలిపి ఎల్‌ఈడి దీపాలకు కనెక్షన్ ఇస్తున్నారు. ఈవిధంగా చేయడం వలన మూడు నిమషాల్లో ఒకఎల్ ఈడి దీపాన్ని అమర్చడానికి సిబ్బందికి వీలుపడుతుంది. అన్నిగ్రామాల్లో ఈవిధంగా సులువు మార్గాన్ని ఎంచుకుని ఎల్‌ఈడి దీపాలు అమర్చి కాంట్రాక్టు సిబ్బంది వెళ్ళిపోయారు. కాపర్ వైర్‌తో విద్యుత్ స్ధంబాలకు ఉన్న అల్యూమినియం వైరుకు కలపడంతో రెండురోజులకే కార్బన్ పట్టి లైట్లు వెలగడం లేదు. ఒకోచోట రాత్రులకు బదులు పగలు దీపాలు వెలుగుతున్నాయి. ఎందుచేత దీపాలు వెలగడంలేదని పంచాయితీల్లో పనిచేసే విద్యుత్ సిబ్బంది పరిశీలించగా అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం గ్రామాల్లో వెలగని ఎల్‌ఈడి దీపాలను విద్యుత్ సిబ్బంది ఏమి చేయలేని పరిస్థితిగా తయారైంది. వాటిని సరిచేయాలంటే దీపాలు అమర్చిన వారు వస్తేనే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని గ్రామాల్లో ఎల్‌ఈడి దీపాలను సరిచేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

పాదగయ ఈవోగా పుష్పనాథం
పిఠాపురం, ఫిబ్రవరి 16: పిఠాపురం పాదగయ ఈవోగా పెద్దాపురం మరిడమ్మ ఆలయ ఈవో పుష్పనాథం నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన చందక దారబాబును కమిషనర్ సస్పెండ్ చేయడంతో పుష్పనాథం శుక్రవారం ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న పుష్పనాథం పెద్దాపురం మరిడమ్మ ఆలయంతోపాటు, రాజమహేంద్రవరం హితకారిణి సమాజం ఈవోగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయనకు పాదగయలో ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. పిఠాపురం ఈవోగా పనిచేసిన దారబాబు పుష్పనాథానికి ఛార్జ్ అప్పగించారు. ఈసందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ పుష్పనాథం మాట్లాడుతూ భక్తులకు పూర్తిస్థాయిలో సేవలందిస్తామన్నారు. పాదగయ ఆలయ ఛైర్మన్ కొండేపూడి ప్రకాష్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన పుష్పనాథానికి పురుహూతికా అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.