తూర్పుగోదావరి

సరిపెట్టేస్తారా..చర్చిస్తారా..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 22: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా జరిగే మహానాడు కార్యక్రమాలు గతానికి భిన్నమైన రీతిలో జరుగుతున్నాయని చెప్పక తప్పదు. నియోజకవర్గ మినీ మహానాడులు జరిగిన తీరు పరిశీలిస్తే దాదాపు మళ్ళీ టిక్కెట్లు ఆశిస్తున్నవారి వివరణలతోనే సాగాయని చెప్పక తప్పదు. ఆశావహులు, రాజకీయ ఔత్సాహికులు, ఇన్‌చార్జిలు వారి రాజకీయ భవిష్యత్‌పై వివరణలతో అద్దం పట్టాయి. వాస్తవానికి రాష్ట్ర మహానాడులో చర్చించే అంశాలకు ఆలంబనగా దిగువ స్థాయి మహానాడులు సాగాల్సి వుంది.
ప్రజా సమస్యలు, పరిష్కారాలపై చర్చిస్తారో లేక, సరిపెట్టాస్తారో తెలియని విధంగా నియోజకవర్గ మినీ మహానాడులు జరిగిన తీరును బట్టి అనుమానాలు కలుగుతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి మినీ మహానాడుల్లో నియోజకవర్గ స్థాయి సమస్యలపై చర్చించి అవసరమైన అంశాలను జిల్లా మహానాడుకు పంపించాల్సి వుంది. కానీ ఎక్కడా ఆ తీరు కన్పించలేదు. అంతా తూతూ మంత్రంగా సాగాయని చెప్పొచ్చు. సోమవారంతో ఒక్క రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ మినీ మహానాడు తప్ప మిగిలిన 18 నియోజకవర్గాల మినీ మహానాడులు పూర్తి చేసుకున్నాయి.
దాదాపు దశాబ్దంన్నర తర్వాత జిల్లా మహానాడుకు చారిత్రాత్మక రాజమహేంద్రవరం వేదికైంది. ఎన్టీఆర్ హయాంలో రాష్ట్ర స్థాయిలో మహానాడులు జరిగేవి. ఆపై చంద్రబాబునాయుడు జిల్లా మహానాడులు నిర్వహించి జిల్లాలో చర్చించి తీర్మానించిన అంశాలు రాష్ట్ర మహానాడులో చర్చించి తీర్మానాలు చేసే విధంగా సంస్థాగత పటిష్టత తీసుకొచ్చారు. ఈ ఏడాది నుంచి కొత్తగా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. మొట్ట మొదటి సారిగా ఈ ఏడాది నియోజకవర్గ మినీ మహానాడులు జరిగాయి. 19 నియోజకవర్గాలు కలిగిన తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం బీజేపీ, జాతీయ రహదారిని ఆనుకుని వున్న తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాలు, ఏజెన్సీ రంపచోడరం నియోజకవర్గాలు వైసీపీ స్థానాలుగా నిలిచాయి. అయితే ఇందులో జగ్గంపేట, ప్రత్తిపాడు తోడళ్లుళ్లు, అనంతరం రంపచోడవరం టీడీపీలో విలీనమయ్యాయి. ఇక జిల్లాలో కొత్తపేట, తుని నియోజకవర్గాలు, ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలు టీడీపీలోనే వున్నాయి. అయినప్పటికీ జిల్లాలోని కేడర్‌లో అసంతృప్తి వుంది. నామినేటెడ్ పదవులు దక్కలేదనే నిరుత్సాహం కన్పిస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గ మినీ మహానాడులు అసంతృప్తుల మాటునే సాగాయని స్పష్టమవుతోంది. ఇంత కాలం ఊరించి ఊరించి ఒక వేళ ఇపుడిచ్చినా ఈ ఏడాది కాలంలో ఏమి చేస్తామనే ధోరణి కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో జరిగిన మినీ మహానాడుల్లో కొన్ని చోట్ల ఆశావహుల వివరణలకే పరిమితమయ్యాయి.
ఇదిలా వుండగా జిల్లా మహానాడుకు వేదికైన రాజమహేంద్రవరంలోని గన్నీస్ శుభమస్తు ఫంక్షన్ హాలును ఎంపిక చేయడంలోనే జిల్లాను ఏకతాటిపై నడిపించే నాయకత్వం కరవైందని రుజువు చేస్తోందంటున్నారు. నియోజకవర్గానికి ఏభై మంది చొప్పున ప్రతినిధుల చొప్పున స్వాగతించినట్టు చెబుతున్నారు. వాస్తవానికి మహానాడు అంటే అన్ని శ్రేణులు హాజరు కావాల్సి వుంది. రాజమహేంద్రవరంలో జిల్లా మహానాడు జరగనున్న ఫంక్షన్ హాలు కనీసం పట్టుమని వెయ్యి మందికి కూడా సరిపోని పరిస్థితి వుంది. జిల్లా పార్టీ వేసుకున్న అంచనాల ప్రకారమే పరిశీలించినా కనీసం రెండు వేల మందికైనా సరిపోవాల్సి వుంది. ఏసీ ప్రధాన హాలు మినహా మిగిలిన అందరినీ బయట టెంట్లు వేసి కూర్చోబెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎంపిక చేసిన వేదికను బట్టే చర్చా లేక, సరిపెట్టేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు నాయకులు వ్యాఖ్యానించుకుంటున్నారు. జిల్లాలో కీలకమైన సమస్యలపై చర్చించడం, విధానపరమైన నిర్ణయాలకు రాష్ట్ర మహానాడుకు పంపించడం కూడా జరగాల్సి వుంది.
రాజమహేంద్రవరంలో 2005లో రాష్ట్ర మహానాడు ప్రతిష్టాత్మకంగా ఎంతో కోలాహలంగా జరిగింది. ఆ తదుపరి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇపుడు జిల్లా మహానాడుకు మళ్ళీ రాజమహేంద్రవరం వేదికైంది. అప్పటికీ, ఇప్పటికీ సంస్థాగతంగానూ, నేతల ఆలోచనల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. బీజేపీతో చెలిమి చెడిన నేపధ్యం, ప్రత్యేక హోదా అంశం, రాష్ట్ర పరిస్థితులు, పార్టీ భవిష్యత్ తదితర అంశాలపై కూలంకషంగా చర్చలు జరగాల్సి వుంది. కీలకమైన తీర్మానాలకు ఆలంభనగా సాగాల్సి వుంది. ఇది ఎంత వరకు సఫలీకృతమవుతుందో అనేది తేలాల్సి వుంది.