తూర్పుగోదావరి

స్మార్ట్ పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 22: కాకినాడ స్మార్ట్‌సిటీలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కాకినాడ స్మార్ట్‌సిటీ బోర్డు డైరెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జరుగుతున్న ప్రాజెక్టులు, ప్రతాప్‌నగర్ బ్రిడ్జి, గాంధీనగర్ పార్కు, ఇంకా పాఠశాలల్లో జరుగుతున్న పనులను తక్షణమే వేగవంతం చేయాలన్నారు. గోదావరి కళాక్షేత్రం, సైన్స్ సెంటర్, కన్‌వర్టబుల్ స్టేడియంకు సమావేశంలో డిజైన్‌ను ఆమోదించారు. ఈ సమావేశంలో మేయర్ సుంకర పావని, కమీషనర్ కె శివపార్వతి, జిఓఐ డిప్యూటీ సెక్రటరీ జి రవీందర్, ఆర్డీ నాగరాజు, డైరెక్టర్లు జెవిఆర్ మూర్తి, సిఇఓ సుజయ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

కొబ్బరి పంటకు గిట్టుబాటు థర కల్పించాలి
మలికిపురం, మే 22: దేశవ్యాప్తంగా కొబ్బరి పంట అభివృద్ధికి డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్ ప్రతిపాదించిన సూచినలను అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని జాతీయ కోకోనట్ గ్రోయర్స్ ఫెడరేషన్ ఛైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు జీవీ హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. దిండి రిసార్ట్స్‌లో రెండు రోజులుపాటు జరిగే ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశాలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొబ్బరి ఆధారంగా దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, కావున ఈ పంట అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఐవీ శేశంకన్ ఫేడరేషన్ కార్యకలాపాలను వివరించారు. దేశవ్యాప్తంగా ఆయా ఉత్పత్తికి అవుతున్న వ్యయాన్ని ఆధారంగా తీసుకొని గిట్టుబాటు ధర కల్పించాలని, కొబ్బరి పంటకు వినియోగించే ఎరువులు, పురుగు మందులు సబ్సీడీ ధరలకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో కేరళ రాష్ట్ర ప్రతినిధులు ఏ ప్రదీపన్, ఎం చంద్రన్, లక్షద్వీప్ ప్రతినిధి సిరాజ్‌కోయా, తమిళనాడు ప్రతినిధి మసిల్‌మణి, పాండి ప్రతినిధి గీతానాధన్, పశ్చిమ బెంగాల్ ప్రతినిధి అనిరూప్ పండా, ఒడిస్సా ప్రతినిధి సతన్ ఉపాద్యాయ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య, బోణం నాగేశ్వరావు, రామినీడి మురళి, తోటే ప్రతాప్, దేవ రాజేంద్రప్రసాద్, వైట్ల విద్యాధర్, చిట్టూరి వేణు, యేరుబండి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.