తూర్పుగోదావరి

భక్త్భివంతోనే భగవదానుగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, మే 22: భగవంతుడి పట్ల ధృడమైన భక్తి కల్గి ఉన్న ప్రతి వారికి భగవాదునుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందని శృంగేరీ పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి ఉద్బోధించారు. మంగళవారం రాత్రి మండలంలోని విజయ దుర్గా పీఠానికి స్వామి విచ్చేశారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు, పీఆర్వో బాబి ఆధ్వర్యంలో వేద పండితులు, భక్తులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. విధుశేఖర భారతీ స్వామి విజయ దుర్గా అమ్మవారికి వివిధ పుష్పాలతో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తూ భగవంతుడు ఒక్కొక్కర్నీ ఒక్కో విధంగా అనుగ్రహిస్తాడన్నారు. అలా ఎందుకు జరుగుతుందో భగవంతునికే తెలుసు అన్నారు. అమ్మవారిపై అపారమైన భక్తి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సునాయసంగా అధిగమించవచ్చునన్నారు. ఎంత గొప్పవారైనా గురువుపట్ల భక్తి కల్గి ఉండాలన్నారు. పీఠాధిపతి గాడ్ జగద్గురువుల యొక్క విశేషానుగ్రహం పొందారన్నారు. అనంతరం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు, పీఆర్వో బాబి, భక్తులు స్వామిజీకి పాద పూజ నిర్వహించారు. స్వామివారిని మహామహోపాధ్యాయ విశ్వనాధ గోపాలకృష్ణ, ఆచార్య శలాఖ రఘునాధశర్మ, అన్నవరం దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు కందర్ప హనుమాన్, అన్నవరం దేవస్థానం పీఆర్వో తులారాం, గాదె భాస్కరనారాయణ, సత్య కామేశ్వరి, పెదపాటి శ్రీనివాసమూర్తి, సత్య కనకదుర్గ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు భారతీ స్వామికి పాద పూజ చేశారు.

జిల్లా బీజేపీ అథ్యక్ష పీఠం ఖాళీ
కాకినాడ, మే 22: జిల్లా బీజేపీ అధ్యక్ష పీఠం ప్రస్తుతానికి ఖాళీ అయిందని, ఈ విషయంపై రాష్ట్ర అధినాయకత్వం త్వరలో ఒక ప్రకటన చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బిక్కిన విశే్వశ్వరరావు, యాళ్ళ దొరబాబు స్పష్టం చేశారు. ఈ నెల 26 నాటికి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారీగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణను కేంద్ర అధినాయకత్వం నియామకాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో పాటుగా కొందరు రాజీనామాలు చేశారన్నారు. వారిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య కూడా ఉన్నారన్నారు. మళ్ళీ మాలకొండయ్య రెండు రోజుల క్రితం తన రాజీనామాను ఉపసంహరించుకున్నానని చెప్పిన సంగతిని వారు గుర్తు చేశారు. రాజీనామా చేసి తర్వాత ఉపసంహరించుకునే అధికారం వారికి లేదన్నారు. ఇది రాష్ట్ర కమిటీ నిర్ధారిస్తుందని చెప్పారు. అంగన్‌వాడీ పోస్టుల ఎంపికలో పూర్తిగా అధికారులు, ప్రజాప్రతినిధులు పారదర్శకతను పాటించలేదన్నారు. ఎమ్మెల్యేల లెటర్లతో సిఫార్సులు చేసిన వారికే అర్హత లేకున్నా ఎంపిక చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎన్‌వి సాయిబాబా, బండారు భాస్కర్, కె గంగరాజు, శంకర్‌సింగ్, వంశీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.