తూర్పుగోదావరి

అక్రమ నెయ్యి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, డిసెంబర్ 28: మండలంలోని వెలిచేరు గ్రామంలో ఆటోపై తరలిపోతున్న సుమారు వంద కేజీల నెయ్యిని ఆత్రేయపురం పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తీపర్రు నుండి వస్తున్న ఆటోను ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామం వద్ద పోలీసులు తనిఖీ చేయగా అక్రమంగా తరలిపోతున్న వంద కేజీల నెయ్యిని గుర్తించారు. ఈ నెయ్యి కల్తీదిగా పోలీసులు భావిస్తున్నారు. నిర్ధారణ కోసం రాజమండ్రి ల్యాబ్‌కు పంపించనున్నట్టు ఆత్రేయపురం ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు. ఈ నెయ్యికి సంబంధించి ఎటువంటి బిల్లులు ఆటో డ్రైవర్ వద్ద లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తీపర్రు గ్రామం నుండి రావులపాలెంకు ఈ నెయ్యిని తరలిస్తున్నట్టు ఆటో డ్రైవర్ చెప్పినట్టు ఎస్సై తెలిపారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ల్యాబ్ నుండి నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై రత్నరాజు చెప్పారు.

పొగరహిత రాష్ట్రానికి కృషిచేయాలి

రావులపాలెం, డిసెంబర్ 28: రాష్ట్రంలోనే తొలి పొగరహిత గ్రామంగా ఎంపికైన కేతరాజుపల్లిని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుని పొగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం మండలంలోని కేతరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ కాసా చాముండేశ్వరి అధ్యక్షతన జరిగిన పొగరహిత గ్రామ పథకం ప్రారంభ సభకు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పొగ ద్వారా వాతావరణంతో పాటు మహిళలు, చిన్నారుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆయిల్ కంపెనీలు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రామం నుండి మండలానికి, మండలం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్రానికి ఈ స్ఫూర్తిని తీసుకుని పొగరహిత రాష్ట్రం నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ పొగరహిత గ్రామమంటే కట్టెల పొయ్యిల వాడకం మానేయడమే కాదని, పురుషులు పొగ తాగడం కూడ మానేయాలని సూచించారు. తన నియోజకవర్గంలోని గ్రామం పొగరహిత గ్రామంగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దీపం పథకం ద్వారా 80 మందికి, ఐఒసిఎల్ కంపెనీ ద్వారా 33 మందికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపిపి కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, ఎఎంసి ఛైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, వైస్ ఎంపిపి దండు సుబ్రహ్మణ్య వర్మ, సర్పంచులు గన్నవరపు వెంకట్రావు, కుడుపూడి వెంకటేశ్వర్లు, కడలి లచ్చన్న, వైసిపి నాయకులు కర్రి నాగిరెడ్డి, బొక్కా వెంకటలక్ష్మి, టిడిపి నాయకులు ఎస్ జనార్ధనరాజు, గుత్తుల పట్ట్భారామారావు, పెచ్చెట్టి చిన్నారావు, తహసీల్దారు సిహెచ్ ఉదయభాస్కర్, ఎంపిడిఒ వై ఉమామహేశ్వరరావు, ఐఒసి చీఫ్ ఏరియా మేనేజర్ సిహెచ్ విజయకుమార్, రాహుల్ ఇండియన్ గ్యాస్ ఏజన్సీ నిర్వాహకుడు కొవ్వూరు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.