పశ్చిమగోదావరి

అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 19: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుకు మద్దతు పలకాలని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు మండలం జాలిపూడిలో గురువారం గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా ఆయన పాదయాత్ర నిర్వహించారు. అన్నివార్డుల్లో పాదయాత్ర జరిపి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు అడిగిన సమస్యలన్నీ పరిష్కరించామన్నారు. పేదకుటుంబాలకు ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, ప్రతి పేదకుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీలకు మూడులక్షల రూపాయలు, బిసిలకు లక్షా 50వేల రూపాయలతో ఇల్లు నిర్మిస్తామన్నారు. పెన్షన్లకు అర్హులైన వారందరికి కూడా వాటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్‌కార్డులు లేని కుటుంబాలవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రామాభివృద్ధి కోసం 30లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో రక్షిత మంచినీటి పధకాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకే ఆదర్శంగా ఉండేవిధంగా జాలిపూడిలో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాన్ని నిర్మించామన్నారు. గ్రామాభివృద్ధికి నిధులు తెచ్చేందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రజలంతా సమైక్యంగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలన్నారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ దాసరి నాగమల్లేశ్వరి, నీటిసంఘం అధ్యక్షులు చుక్కా వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు నేతల రవి, ఆరేమండ సురేష్, దీపక్ నెక్స్‌జెన్ ఎండి అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పెనుబోయిన మహేష్‌కుమార్, టిడిపి నేత దాసరి నరసింహరావు(బుజ్జి) తదితరులు పాల్గొన్నారు.