తూర్పుగోదావరి

సైన్స్‌పై మరింత అవగాహన పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: విశ్వవ్యాప్తంగా సైన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, భారతదేశంలో సైన్స్‌పై పరిశోధనలు మరిన్ని జరగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి అశోక్ అన్నారు. విద్యార్థుల్లో మరింత విజ్ఞానం పెంపొందాలని, ప్రజలందరికీ శాస్ర్తియపరమైన అవగాహన పెరగాలన్నారు. విశ్వవిద్యాలయంలో లైఫ్ అండ్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ అప్లైడ్ బయాలజీ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ డాక్టర్ టి అశోక్ మాట్లాడుతూ గ్లోబల్ విలేజ్‌గా అభివృద్ధి చెందుతున్న నేటి ఆధునిక సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ ప్రాధాన్యత పెరిగిందన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు నెలవైన భారతదేశంలో మరింత ఎక్కువగా శాస్ర్తియపరమైన అవగాహన పెరగాలని, అనేక అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు నేటి తరం విద్యార్థులు కృషి చేయాలన్నారు. అంతకుముందు ఆచార్య సిన్హా (పశ్చిమ బెంగాల్, కళ్యాణి యూనివర్సిటీ) నేటి తరం జీవశాస్త్ర ఔన్నత్యాన్ని, పోకడలను తెలియజేస్తూ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. నానోపార్టికల్స్ ప్రాముఖ్యతపై చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. శాన్‌జైమ్స్ బయాలజికల్స్ జనరల్ మేనేజర్ కేసీ దాస్ బయోటెక్నికల్ అప్లికేషన్స్ ఇన్ ఆక్వాకల్చర్ అనే అంశంపై విశే్లషణ చేశారు. ఆక్వారంగాన్ని పర్యావరణహితంగా ఎలా మార్చుకోవాలనే విషయాన్ని విపులంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ సదస్సు కన్వీనర్ డాక్టర్ పి విజయ నిర్మల మాట్లాడుతూ రెండు రోజుల జాతీయ సదస్సు దిగ్విజయంగా జరిగిందన్నారు. ఈ రెండు రోజుల సదస్సులో జీవశాస్త్రానికి సంబంధించిన 230 పరిశోధనా పత్రాలు వచ్చాయన్నారు. వీటిలో ఎంపిక చేసిన 34 ఉపన్యాసాలు విద్యార్థులకు అందించడం జరిగిందన్నారు. ఈ జాతీయ సదస్సుకు అన్నివిధాలా సహకారాన్ని అందించిన వీసీ ముత్యాలనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ టి అశోక్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఎ మట్టారెడ్డి, డాక్టర్ రమణేశ్వరి, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ సతీష్, డాక్టర్ బాలాజీ చంద్రవౌళి, డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ కమలాకర్, డాక్టర్ శ్రీ్ధర్, డాక్టర్ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
ప్లాంటేషన్ల సమగ్ర గణనకు సీసీఎఫ్ ఆదేశం

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: అటవీ శాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో ఉన్న ప్లాంటేషన్లను సమగ్రంగా గణన చేయాలని ముఖ్య అటవీ సంరక్షణాధికారిణి శాంతిప్రియ పాండే సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక దివాన్‌చెరువులోని ఏపీ రాష్ట్ర అటవీ అకాడమి ప్రాంగణాన్ని, రిజర్వు ఫారెస్టు ఏరియా, నగరవనం ప్రాంతాలకు శుక్రవారం ముఖ్య అటవీ సంరక్షణాధికారిణి శాంతిప్రియ పాండే పరిశీలించారు. ప్లాంటేషన్లను సమగ్రంగా సర్వే చేసి ఆ వివరాలను రికార్డు చేయాలని స్టేట్ సిల్వికల్చరిస్ట్ శ్రీహరిగోపాల్‌ను ఆదేశించారు. సిల్వికల్చర్ విభాగం ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధమైన పరిశోధనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ అకాడమి బోధనా ప్రణాళికను, శిక్షణ పొందుతున్న వారికి గత వసతి సముదాయాలను, భోజన హాలును, అకాడమి కార్యాలయ వసతులను శాంతిప్రియ పాండే పరిశీలించారు. అనంతరం నగరవనం ప్రాంగణంలోని మెరైన్ లేబోరేటరీ, వృక్ష పరిశోధనాలయం, బయో డైవర్సిటీ సెంటర్, వాకింగ్ ట్రాక్స్, యాంపీ థియేటర్, బాంబు సెటమ్, ప్లాంటేషన్స్‌ను పరిశీలించారు. కార్యాలయం ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అకాడమి ఉపసంచాలకులు శ్రీనివాసరావు, ఎంవి ప్రసాదరావు, ఎస్‌ఎస్ శ్రీహరిగోపాల్, నగరవనం రేంజీ అధికారి శ్రీసాయి, అకాడమి ఫ్యాకల్టీ సభ్యులు ఉదయ్ శంకర్, రాజేంద్రప్రసాద్, ఎస్‌వో నీలం ప్రసాద్ పాల్గొన్నారు.