తూర్పుగోదావరి

జల దిగ్బంధంలో కూనవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూనవరం, ఆగస్టు 17: ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి, శబరి నదులకు వరద ప్రవాహం కొనసాగటంతో కూనవరం మండలం జల దిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రి 7గంటలకు కూనవరం వద్ద గోదావరి 18.6 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. ఉదయం 11 గంటలకు 17.74 మీటర్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకోగా, రాత్రి 9గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక చేరుకునే అవకాశం ఉంది. గోదావరీ పరీవాహక ప్రాంతాలైన భద్రాచలం, దుమ్ముగూడెం, ఏటూరు నాగారం, కాళేశ్వరంల వద్ద స్వల్పంగా వరద తగ్గుముఖం పట్టగా పేరూరు వద్ద మాత్రం స్వల్పంగా పెరుగుతోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద ప్రవాహం పోటెత్తడంతో మురుమూరు వద్ద ప్రధాన రహదారిపై గోదావరి వరద చేరుకోవటంతో మధ్యాహ్నం 2గంటల నుంచే భద్రాచలం వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వెళ్లే రహదారిపై వరద చేరుకోవటంతో ఇటువైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కోనరాజుపేట కాజ్‌వేపైకి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రానికీ, ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వీఆర్ పురం బ్రిడ్జికి రెండడుగుల కింద శబరి ప్రవాహం కొనసాగుతోంది. రెండు నదుల వరద ప్రవాహంతో వరి పంట సుమారు 400 ఎకరాలు, పత్తి 50 ఎకరాలు, మొక్క జొన్న 15 ఎకరాల్లో వరద నీటిలో ఉన్నట్టు వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. శబరి నదికి శారదా ఫూట్, సుకుమ, కొంట వద్ద వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. గోదావరి వరద శనివారం ఉదయానికి 19 మీటర్లకు చేరుకుని అనంతరం నిలకడగా ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. చింతూరు ఐటీడీఏ పీవో అభిషిక్త్ కిశోర్ కూనవరం మండలంలో శుక్రవారం పర్యటించి వరద ఉధృతిని పరిశీలించారు. ఓఎస్డీలు అంబురాజన్, చక్రవర్తి, డీఎస్పీ దిలీప్ కిరణ్, ఎటపాక సీఐ రవికుమార్ వరద ఉధృతిని పరిశీలించి తగిన బందోబస్తు ఏర్పాటుచేయాలని ఎస్సై అజయ్‌బాబును ఆదేశించారు.