తూర్పుగోదావరి

వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 18: జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం వ్యవసాయ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఈ సంవత్సరం 15.53 కోట్ల వ్యయంతో 1002 ట్రాక్టర్లను లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ట్రాక్టర్ల పంపిణీకి లబ్దిదారులను గుర్తించాలన్నారు. డ్రిప్ వినియోగంతో మైక్రో ఇరిగేషన్ కింద 2500 హెక్టార్టలలో ఈ సంవత్సరం కొత్తగా సాగును ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో పాలు, గుడ్ల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం నవంబరు నాటికి లింకేజీ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. వెలుగు పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 1343 కోట్ల లింకేజీ లక్ష్యాన్ని నవంబరుకు పూర్తి చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల కల్పనలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని చెప్పారు. ఈ సంవత్సరం ఇంతవరకు 28వేల 388 గ్రూపులకు 815 కోట్ల మేర రుణాలందించినట్టు తెలియజేశారు. నిరుద్యోగ యువతకు భృతినందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ నేస్తం పథకాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పథకం కింద జిల్లాలో 1.2 లక్షల మంది నిరుద్యోగులకు మేలు చేకూరుతుందన్నారు. జన్సీలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలల్లోనూ తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం సక్రమంగా ఉండేలా చూడాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ శాఖలపై జరిగిన సమీక్షలో జేసీ-2 సిహెచ్ సత్తిబాబు, డీఆర్వో ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ కేఎన్‌వీ ప్రసాద్, మత్స్యశాఖ జేడీ జయరావు పాల్గొన్నారు. బ్యాంక్ లింకేజీపై నిర్వహించిన సమీక్షలో జేసీ-2 సత్తిబాబు, డీఆర్‌డిఏ పీడీ మధుసూధనరావు, మధ్యాహ్న భోజన పథకంపై నిర్వహించిన సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహాం, సర్వశిక్షాభియాన్ పీడీ ఎం శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

గృహాలను అందంగా తీర్చిదిద్దాలి
దేవీపట్నం, సెప్టెంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించే గృహాలను అందంగా తీర్చిదిద్దాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం దేవీపట్నం మండలం ఇందుకూరు సమీపంలో నిర్మిస్తున్న పునరావాస కాలనీని ఆయన సందర్శించారు. లబ్ధిదారులకు నిర్మించే గృహాలు రెండు బెడ్ రూంలు, హాలు, కిచెన్ తప్పనిసరిగా ఉండాలని, వాటితోపాటు బయట వెల్వేషన్ వర్క్‌ను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ఎవరెవరికి ఏ ఇల్లు కేటాయిస్తున్నారో తప్పనిసరిగా తెలియజేయాలని జేసీ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు ముంపు బాధితుల ఒక్కో ఇంటికి రూ.2.8 లక్షలతో నిర్మిస్తున్నామని, అయితే గిరిజనులకు అదనంగా కోయదొరలకు రూ.75వేలు, కొండరెడ్డి కుటుంబాలకు లక్ష రూపాయలు మంజూరవుతున్నాయని ఆయన తెలిపారు. ఒక వారం రోజుల్లో మోడల్‌గా ఒక ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు ప్రదర్శించాలని జేసీ అధికారులకు ఆదేశించారు. దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టుకు ముంపునకు గురవుతున్న గిరిజనేతరుల కుటుంబాల కోసం గోకవరంలో భూమి సేకరించామని, రెండు వారాల్లో సుమారు వెయ్యి ఇళ్లకు టెండర్లు పిలుస్తామని జేసీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ పర్యటనలో ఆయన వెంట రంపచోడవరం సబ్ కలెక్టర్ డాక్టర్ వి వినోద్‌కుమార్, తహసీల్దార్ ఎస్ సత్యనారాయణమూర్తి, హౌసింగ్ ఈఈ రవిశంకర్, డీఈ వెంకట్రావు, ఆర్‌ఐ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్‌తో ప్రాణాలను రక్షించుకోండి
రాజవొమ్మంగి, సెప్టెంబర్ 18: వాహనాలను నడిపే సమయంలో ప్రాణాలను రక్షించే హెల్మెట్ తప్పక ధరించాలని రంపచోడవరం ఏఎస్పీ పి రాహుల్‌దేవ్ సింగ్ కోరారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్టేషన్‌లో వాహన చోదకుల అవగాహనా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కువ మంది వాహన చోదకులు హెల్మెట్లు ధరించకపోడం వలనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువగా ప్రమాదాలబారిన పడుతున్నారు. 50మంది వాహన చోదకులకు ఉచితంగా ఏఎస్పీ హెల్మెట్లు పంపిణీ చేసారు. అనంతరం హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించారు. సీఐ పి వెంకట త్రినాధ్, ఎస్సై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.