తూర్పుగోదావరి

‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: తెలుగు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల ఖుషీ ఖుషీగా నవ్వుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రముఖ నటుడు అశోక్‌కుమార్ తెలిపారు. స్థానిక వై జంక్షన్ వద్ద ఆనం రోటరీ హాలులో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంతో సహకారాన్ని అందించారన్నారు. పట్టపగలు వెంకట్రావు, జిత్‌మోహన్‌మిత్రా, స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని, అందరి సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆధునిక శ్మశానవాటికల నిర్వహణలో పట్టపగలు వెంకట్రావు చేస్తున్న కృషి అమోఘమని అశోక్‌కుమార్ ప్రశంసించారు. ఖుషీ ఖుషీగా నవ్వుతూ కార్యక్రమం విశేషంగా సాగిందని రోటరీ అధ్యక్షుడు పట్టపగలు వెంకట్రావు అభినందించారు. నటుడు జిత్‌మోహన్ మిత్రా మాట్లాడుతూ ప్రతి నిత్యం ఒత్తిడికి గురయ్యేవారికి ఆనందం పంచాలనే లక్ష్యంతో అశోక్ కుమార్ ప్రారంభించిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు. ఆలూర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంతోష్‌కుమార్, వెంకటరమణ, ఆనంద్ తదితరులు మాట్లాడారు.
.
నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
రామచంద్రపురం, సెప్టెంబర్ 18: వినాయక చవితి సందర్భంగా నవరాత్రులూ పూజలందుకున్న సిద్ధి వినాయక ప్రతిమలను కోటిపల్లి వద్ద గౌతమీ గోదావరి నదిలో నిమజ్జనం చేసే నేపథ్యంలో అక్కడి పరిస్థితులను రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఆర్డీవో ఎన్ రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, తహసీల్దార్ మహ్మద్ యార్ఖాన్, సీఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్, పంచాయతీరాజ్ ఈవో పీఆర్డీ గిడ్ల భీమారావు, గ్రామ పంచాయతీ సచివాలయ కార్యదర్శి రాయుడు ఈశ్వరరావు (మోహన్)తోపాటు కోటిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రముఖులు పప్పుల సాయిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శని, ఆది, సోమవారాల్లో నిమజ్జనోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ సంయుక్త తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆర్డీవో రాజశేఖర్, డీఎస్పీ సంతోష్ తెలిపారు.
రాజకీయ పక్షాలతో సమావేశం
రాజకీయ పక్షాల ప్రతినిధులతో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో మంగళవారం ఆర్డీవో ఎన్ రాజశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతినిధులతో ఆర్డీవో రాజశేఖర్ మాట్లాడుతూ అదనంగా 19 పోలింగ్ కేంద్రాలు మంజూరైనట్టు తెలిపారు. 1100మంది ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్లకు అదనంగా ఈ పోలింగ్ స్టేషన్లు పనిచేస్తాయన్నారు. సెప్టెంబర్ 1న ఓటర్ల జాబితా ప్రచురించామని, ఇంకా ఎవరైనా 18 ఏళ్లుదాటిన వారు పేరు నమోదు, ఫోటో మార్పిడి, అక్షర దోషాలు, తేడాపాడాలు, సవరణలకు అక్టోబర్ 31వ తేదీ వరకూ గడువు ఉన్నట్లు తెలిపారు. తుది జాబితా 2019, జనవరి 4న ప్రచురితమవుతుందన్నారు. పీఎల్వోల జాబితా, అదనంగా మంజూరైన పోలింగ్ స్టేషన్ల జాబితాలను హాజరైన రాజకీయ ప్రతినిధులకు ఆర్డీవో రాజశేఖర్ అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పైడి చిన్నారావు, ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి పెండ్యాల రామమ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా రాధా జయంతి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని శ్రీ వల్లభ గణపతి పీఠంలో ప్రవచన విరించి, బ్రహ్మశ్రీ సామావేదం షణ్ముఖ శర్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ రాధా జయంతి కార్యక్రమం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. రాధాదేవికి, వల్లభదేవికి గల అభేదాన్ని ఈ సందర్భంగా సామవేదం ప్రతిపాదించారు. వందలాది మంది భక్తులు కార్యక్రమానికి హాజరై వివిధ ప్రసాదాలు, దీపారాధనలతో పీఠం ప్రాంగణాన్ని శోభాయమానం గావించారు. పీఠంలోని రాధాకృష్ణుల ఉపాలయం వద్ద పూజాదికాలు జరిపారు. ఈ సందర్భంగా సామవేదం షణ్ముఖ శర్మ రాధాదేవి వృత్తాంతాన్ని, వివిధ పురాణాలు, భాగవత శాస్త్రంలో గత విశేషాలను అద్భుతంగా వివరించారు.